Manami Ito : హ్యాట్సాఫ్.. కృతిమ చేత్తోనే అద్భుతం, వయోలిన్ వాయిస్తూ ప్రశంసలు అందుకుంటున్న మహిళ

అంగవైకల్యం శరీరానికే తప్ప ఆశయానికి కాదని నిరూపించింది. కృతిమ చేత్తోనే వయోలిన్ వాయిస్తూ ఔరా అనిపిస్తోంది. అంతేనా.. ఒలింపిక్స్ లో కూడా పాల్గొని తన ప్రతిభ ప్రపంచానికి చాటింది.(Manami Ito)

Manami Ito : హ్యాట్సాఫ్.. కృతిమ చేత్తోనే అద్భుతం, వయోలిన్ వాయిస్తూ ప్రశంసలు అందుకుంటున్న మహిళ

Manami Ito : ఈ రోజుల్లో శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా.. మాకేమీ చేతకాదు, మేము ఏమీ చేయలేయము అనే నిరాశ నిస్పృహలో చాలా మంది ఉంటారు. జీవితంలో ఏదీ సాధించలేము అని ఫిక్స్ అయిపోతారు. కనీసం ప్రయత్నం కూడా చేయరు.

కానీ, ఆమె మాత్రం అలా కాదు. అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయలేదు. అంగవైకల్యం శరీరానికే తప్ప ఆశయానికి కాదని నిరూపించింది. కృతిమ చేత్తోనే వయోలిన్ వాయిస్తూ ఔరా అనిపిస్తోంది. అంతేనా.. ఒలింపిక్స్ లో కూడా పాల్గొని తన ప్రతిభ ప్రపంచానికి చాటింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జపాన్ కు చెందిన మనామి ఇటో.. 2004లో నర్సింగ్ చదువుతున్న సమయంలో ఓ రోడ్డు ప్రమాదంలో తన కుడి చేతిని కోల్పోయింది. అయితే ఆమె ధైర్యం మాత్రం కోల్పోలేదు. ఒక చేయి లేదని కుంగిపోలేదు. తన రాత ఇంతేనని బాధపడుతూ కూర్చోలేదు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే ఆశయంతో ముందుకు సాగింది. కృతిమ చెయ్యిని పెట్టించుకుంది. అది పేరుకే కృతిమ చెయ్యి. ఆమెకి మాత్రం నిజమైన చేతితోనే సమానం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే ఆశయంతోనే కృతిమ చేత్తో వయోలిన్ వాయించడం సాధన చేసింది. అంతేకాదు 2008, 12 లో పారాలింపిక్స్ గేమ్స్ లో తన కృత్రిమ చేత్తో వయోలిన్ వాయిస్తూ పోటీ పడింది. 2020లో పారాలింపిక్స్ గేమ్స్ ప్రారంభ వేడుకలో ఆమె వయోలిన్ వాయిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మనామి.. నర్సుగా పని చేస్తోంది. వయోలిన్ వాయించడమే కాదు స్విమ్మింగ్ కూడా చేస్తుంది. జపాన్ దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తుంటుంది. జపాన్ లో కృతిమ చేయి కలిగిన తొలి నర్సు మనామినే. అంగవైకల్యంతో బాధపడుతున్న కొందరు బాస్కెట్ బాల్ ఆడటం చూసిన మనామి.. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని తనూ డిసైడ్ అయ్యింది. 2012 పారాలింపిక్స్ లో స్విమ్మింగ్ పోటీలో 8వ స్తానంలో నిలిచింది. ప్రస్తుతం మనామి వయసు 34ఏళ్లు. ఓ బిడ్డకు ఆమె తల్లి.

Also Read..UP bridegroom: తనకు కట్నంగా ఇచ్చిన రూ.11 లక్షలు, బంగారాన్ని తిరిగి ఇచ్చేసిన పెళ్లి కొడుకు

మనామి పట్టుదలకు, ప్రతిభకు అంతా ఫిదా అవుతున్నారు. అంగవైకల్యం శరీరానికే తప్ప ఆశయానికి కాదని నిరూపించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేని ఏదీ లేదని చెప్పేందుకు మనామి నిలువెత్తు నిదర్శనం అని కితాబిస్తున్నారు.