Hazardous Asteroid KT1 : జూన్‌లో భూమికి ముప్పు? : ఐక్యతా విగ్రహం కంటే అతిపెద్ద గ్రహశకలం దూసుకొస్తోంది..

జూన్ నెలలో భూమికి ముప్పు పొంచి ఉందా? అతిపెద్ద ప్రమాదకర గ్రహశకలం ఒకటి భూమివైపు దూసుకొస్తోంది. ప్రమాదకరమైన గ్రహశకలం (KT1) భూమికి దగ్గరగా వెళ్లనుంది.

Hazardous Asteroid KT1 : జూన్‌లో భూమికి ముప్పు? : ఐక్యతా విగ్రహం కంటే అతిపెద్ద గ్రహశకలం దూసుకొస్తోంది..

Hazardous Asteroid Kt1

Hazardous Asteroid KT1 : జూన్ నెలలో భూమికి ముప్పు పొంచి ఉందా? అతిపెద్ద ప్రమాదకర గ్రహశకలం ఒకటి భూమివైపు దూసుకొస్తోంది. అంతరిక్ష పరిశోధన సంస్థ  నాసా అంచనా ప్రకారం.. ప్రమాదకరమైన గ్రహశకలం (KT1) భూమికి దగ్గరగా వెళ్లనుంది.

ఈ శకలం పరిమాణం సుమారు 186 మీటర్లు ఉంటుంది.. అంటే.. 182 మీటర్ల పొడవైన ఐక్యతా విగ్రహం (Statue of Unity) కంటే పెద్దదిగా ఉంటుందని నాసా అంటోంది. జూన్ 1 నుంచి జూన్ 2 మధ్య భూమి నుంచి 72 లక్షల కిలోమీటర్ల దూరంలో ప్రయాణించనుంది. ఈ గ్రహశకలం దూరం భూమి, చంద్రుల మధ్య దూరం కంటే 20రెట్లు ఎక్కువగా ఉంటుందట..

నాసా కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీస్, డాష్‌బోర్డ్ ఆస్టరాయిడ్ గమనాన్ని నిశితంగా గమనిస్తోంది. దీని ప్రకారం.. మే 31 నుంచి జూన్ 2 వరకు మధ్య భూమికి దగ్గరగా దూసుకొచ్చే ఐదు గ్రహశకలాల్లో KT1 ఒకటి. బస్సు సైజులో ఉండే ఉల్క మే 31న భూమి, చంద్రుల మధ్య దూరంలో మూడింట ఒక వంతు దూరంలో ఉందని నాసో పేర్కొంది.

మిగిలిన గ్రహశకలాల్లో రెండు ఇళ్లంతా పెద్దగా ఉంటే.. ఒకటి మాత్రం విమానమంత సైజులో గ్రహశకలం ఉంది. ఈ ఉల్కలు 11 లక్షల కిలోమీటర్ల నుంచి 59 లక్షల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించనున్నాయి. ఈ గ్రహశకలాలతో భూమికి ఎలాంటి ముప్పు లేదని, వాటిని అంతరిక్ష సంస్థ ప్రమాదకరమైనదిగా పరిగణించలేదు. KT1 గ్రహశకలం పరిమాణం చాలా పెద్దదిగా ఉంది. నాసా 150 మీటర్ల కంటే పెద్దదిగా ఉంటుందని అంటోంది. అయితే 75 లక్షల కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించే ఏదైనా గ్రహశకలం ప్రమాదకరమని అంచనా వేస్తోంది.

అంత పరిమాణంలో ఉన్న ఒక గ్రహశకలం, భూమిని తాకితే.. వినాశనం తప్పదు.. అదృష్టవశాత్తూ నాసా సాంకేతికతతో అభివృద్ధి చెందింది. ఇలాంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించగలదు. ప్రమాదకరమైన ఉల్క భూమిని ఢీకొనకుండా దాని మార్గాన్ని తప్పించగల భారీ ద్రవ్యరాశిని పంపగల సామర్థ్యం నాసాకు ఉంది. గతంలో భూమి చాలా చిన్నపాటి గ్రహశకలాలు ఢీకొనడంతో దెబ్బతింది.

66 మిలియన్ సంవత్సరాల క్రితం.. కొన్ని కిలోమీటర్ల వ్యాసం కలిగిన ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టింది. అప్పుడు భూమిపై మొక్కలు, జంతు జాతులలో మూడింట నాలుగు వంతులు అంతరించిపోయాయి. వాటిలో డైనోసార్‌లు ఒకటి. గ్రహశకలం నుంచి ఉత్పన్నమయ్యే శక్తి.. అనేక మిలియన్ల అణ్వాయుధాల శక్తితో సమానమైనది. జీవ వినాశనం తప్పదు.. కానీ, ఇప్పుడు ఆ ప్రమాదం లేదంటోంది నాసా..