న్యూజిలాండ్‌లో మరోసారి కరోనా.. ఎన్నికలు వాయిదా

  • Published By: vamsi ,Published On : August 17, 2020 / 08:39 AM IST
న్యూజిలాండ్‌లో మరోసారి కరోనా.. ఎన్నికలు వాయిదా

న్యూజిలాండ్‌లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. గడిచిన 24 గంటల్లో, న్యూజిలాండ్‌లో కొత్తగా 13 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో న్యూజిలాండ్‌లో క్రియాశీల కేసుల సంఖ్య 69 కి పెరిగింది. మే నెలలో న్యూజిలాండ్ కరోనా రహితంగా ప్రకటించన తర్వాత ఇప్పుడు నమోదైన కేసులు ఆ దేశంలో ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కేసులు మళ్లీ రావడం ప్రారంభించడంతో ఆ దేశంలో సాధారణ ఎన్నికలు నాలుగు వారాలు వాయిదా పడ్డాయి.



ఆరోగ్య వ్యవహారాల డైరెక్టర్ జనరల్ ఆష్లే బ్లూమ్‌ఫీల్డ్ మాట్లాడుతూ, కొత్త కేసులన్నీ ఆక్లాండ్‌లోని క్లస్టర్‌కు అనుసంధానం చెయ్యబడ్డాయి. ఇక్కడ ఇటీవల వ్యాప్తి ప్రారంభమైంది. ఆగస్ట్ నెల ప్రారంభంలో ఒక పిల్లవాడు ఆఫ్ఘనిస్తాన్ నుండి న్యూజిలాండ్ వచ్చాడని బ్లూమ్‌ఫీల్డ్ చెప్పారు. మొదట అతను కరోనా నెగెటివ్ అని తేలింది, కాని 14 రోజుల దిగ్బంధం కాలం 12 వ రోజు, అతకి కరోనా పాజిటివ్ అని తేలింది. అప్పటి నుండి అతను ఆక్లాండ్‌లోని దిగ్బంధంలో ఉంచబడ్డాడు అని బ్లూమ్‌ఫీల్డ్ చెప్పారు.



న్యూజిలాండ్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 1271:
కొత్త కేసుల రాకతో, న్యూజిలాండ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1271 కు పెరిగింది. అందులో 69 కేసులు చురుకుగా ఉండగా.. వారు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రధాని జకిందా ఆర్డెర్న్ ఆక్లాండ్ ప్రాంతంలో హెచ్చరిక 3 మరియు ఇతర ప్రదేశాలలో హెచ్చరిక 2 ప్రకటించారు. ఆగస్టు 26 వరకు లాక్డౌన్ ప్రకటించారు.



12 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనుంది. మార్చి చివరలో న్యూజిలాండ్ ఒక నెల రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఆ తరువాత కరోనా వైరస్‌ను జూన్లో జయించిన మొదటి దేశంగా న్యూజిలాండ్ అవతరించింది. కానీ 102 రోజుల విరామం తర్వాత దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ వస్తున్నాయి.