కరోనాతో పోరాడుతున్న సిస్టర్ ‘అమ్మా’ హ్యాట్సాఫ్ : గాల్లోనే హగ్ చేసుకున్న తల్లీ బిడ్డా..heartbreaking video

  • Published By: veegamteam ,Published On : February 8, 2020 / 04:31 AM IST
కరోనాతో పోరాడుతున్న సిస్టర్ ‘అమ్మా’ హ్యాట్సాఫ్ : గాల్లోనే హగ్ చేసుకున్న తల్లీ బిడ్డా..heartbreaking video

చైనాలోని హనాన్‌ ప్రావిన్స్‌ ఫుగావ్‌ కౌంటీలోని పీపుల్స్‌ ఆస్పత్రిలో లీ హయాన్ అనే నర్సు కరోనా వైరస్ సోకిన బాధితులకు సేవలందిస్తోంది. తన చిన్నారి కూతుర్ని కూడా ఇంటి దగ్గరే విడిచిపెట్టిన కరోనా బాధితులకు సేవలు చేస్తోంది. బిడ్డను కళ్లారా చూడాటానికి కూడా వీలు చిక్కలేదు ఆమెకు. ఓ పక్క నిద్రాహారాలు మాని హాస్పిటల్ లోనే ఉంటూ కరోనా బాధితులకు సేవ..మరో పక్క కళ్లల్లో మెదులుతున్న తన చిట్టితల్లి. బిడ్డ దగ్గరకు వెళ్లలేని అమ్మజ తల్లి దగ్గరకు రాలేని బిడ్డ. కానీ ఆ 9ఏళ్ల చిన్నారి తల్లిని చూడకుండా ఉండలేకపోయింది. ఓ చిన్న సంచీ పట్టుకుని హాస్పిటల్ కు వచ్చేసింది. 

ఆ నర్సు అమ్మను చూసిన ఆ కుమార్తె లేత బుగ్గల నిండా కన్నీరు జలపాతంలా కారిపోతుండగా..‘అమ్మా.. నిన్ను మిస్ అవుతున్నా’ నిన్ను చూడకుండా నీ వెచ్చని ఒడి లేకుండా ఉండలేకపోతున్నా’’ అంటూ గాల్లోనే సంజ్ఞలు చేస్తూ గాల్లోనే చేతులు చాచి హత్తుకున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి.

తల్లీ కూతురు ఇద్దరూ మాస్క్‌లు ధరించి ఉన్నారు. కన్నీళ్లతో ఆ చిన్నారి..ఎదురుగా కంటికీకడివెడి కన్నీరు కారుస్తున్న తన చిట్టితల్లిని తనవితీరా హత్తుకోలేని ఆ తల్లి మానసిక వేదన గురించి ఎంత చెప్పినా తక్కువే. గుండెను చిక్కబట్టుకుని..బిడ్డను గుండెలకు మనసారా హత్తుకుని ఆ లేత బుగ్గపై ముద్దుల వర్షం కురింపించాలని తపనను అతి కష్టంపై కంట్రోల్ చేస్తుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ.. తాను కూడా గాల్లోనే  చేతులు చాచి కౌగలించుకుంది. కరోనా బాధితులకు సేవలు చేసే డాక్టర్లు, నర్సులు..వైద్య శిబ్బంది తమ కుటుంబాలను కలుసుకోకుడదనే నిషేధం ఉండటంతో (వారికి కూడా వైరస్ వస్తుందనే ముందు జాగ్రత్తతో నిషేధం) ఆ తల్లీబిడ్డలిద్దరూ ‘ఎయిర్ హగ్’ ద్వారా తమ ప్రేమను పంచుకున్నారు. ఒకరిని మరొకరు కళ్లనిండుగా చూసుకున్నారు. 

నర్సు లీ హయాన్ పది రోజులుగా తన బిడ్డకు కలవలేదు. ‘‘ఇక్కడ నేను కరోనా పిశాచితో పోరాడుతున్నా. దాన్ని తరిమికొట్టాక ఇంటికి తిరిగొస్తా’ అంటూ ఆ నర్సు తన కుమార్తెకు జాగ్రత్తలు చెప్పింది. చక్కగా తిని బుద్ధిగా ఉండాలని అమ్మగా జాగ్రత్తలు చెప్పింది. తరువాత ఆ పాప తనకూడా తీసుకొచ్చిన చిన్న సంచిని అక్కడ ఉంచి దూరంగా జరిగింది. ఆ సంచి తీసుకొని నర్సు కన్నీళ్లు కారుస్తూనే మళ్లీ తన విధుల్లోకి వెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

ఆ దృశ్యాలు ప్రపంచంలోని ప్రతీ ఒక్కరి గుండెల్ని పిండేస్తున్నాయి..ఈ దృశ్యాన్ని చైనాకు చెందిన Xinhua news పోస్ట్‌ చేసింది. ఈ వీడియోను లక్షలాది మంది చూశారు. ఈ దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. ప్రాణాంతక వైరస్‌ను ఎదుర్కొనేందుకు డాక్టర్లు, నర్సులు ఎంతటి త్యాగాలు చేస్తున్నారో అంటూ ప్రశంసలు కురిపించారు.కరోనాపై పోరులో చైనా గెలిచేందుకు దేవుడు సాయం చేయాలంటూ కోరుతున్నారు. 

కాగా చైనాలో కరోనా వైరస్ బారిన పడి ఇప్పటికే 670 మందికి పైగా మరణించారు. మరో 31 వేల మంది మృత్యువుతో పోరాడుతున్నారు. వుహాన్ నగరంలో పరస్థితి మరో భయానకంగా ఉండటంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయి శ్మశాన వైరాగ్యం అలుముకుంది. ఈ భయానక పిశాచాన్ని తరిమికొట్టడానికి చైనా ఎన్నో త్యాగాలు చేస్తోంది. ఆ త్యాగాలు ఫలించాలని..కరోనా మహమ్మారి అంతమొందాలని కోరుకుందాం..