రోస్ట్ బీఫ్ శాండ్ విచ్, గ్రేవీ కోసం హెలికాప్టర్ లో 128 కిలో మీటర్ల జర్నీ

బీఫ్ రోస్ట్, ఆనియన్ గ్రేవ్ కోసం 128 కిలో మీటర్లు హెలికాప్టర్ లో ప్రయాణించాడు...

రోస్ట్ బీఫ్ శాండ్ విచ్, గ్రేవీ కోసం హెలికాప్టర్ లో 128 కిలో మీటర్ల జర్నీ

beef

roast beef sandwich : తమకు ఇష్టమైన ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని ఎంతదూరమైనా వెళుతుంటారు. ఇందుకు భారీగానే ఖర్చు చేస్తున్న సంఘటనలు చూస్తూనే ఉంటాం. కరోనా కాలంలో చాలా మంది ఆహారం కోసం ఎంతో కష్టపడ్డారు. ఆహారం కంటే మించిన ఖర్చును పెట్టి ఆర్డర్స్ తెప్పించుకున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో బటర్ చికెన్ కోసం ఓ మిలియనీర్ ఏకంగా 32 కిలోమీటర్లు ప్రయాణించిన సంగతి తెలిసిందే. దీనికి 2 వేల 680 డాలర్లు వెచ్చించాడు.

2021 సంవత్సరం ప్రారంభమైనా కరోనా ఇంకా వీడలేదు. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోస్ట్ బీఫ్ శాండ్ విచ్, ఆనియన్ గ్రేవీ కోసం హెలికాప్టర్ లో ఏకంగా 128 కిలో మీటర్లు ప్రయాణించిన ఘటన ఒకటి వెలుగు చూసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యూకేలో ఓ పైలట్ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి..బీఫ్ రోస్ట్, ఆనియన్ గ్రేవ్ కోసం 128 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిప్పింగ్ వద్ద Chipping Farm దుకాణానికి హెలికాప్టర్ లో వెళ్లాడు. అక్కడ పార్సిల్ లో ఉన్న ఫుడ్ ను తీసుకున్నాడు.

దీనికి సంబంధించి వీడియోను chippingfarmshop ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశారు. షాప్ లో పనిచేసే ఓ సిబ్బంది పైలట్ కు ఫుడ్ ఇచ్చినట్లు, అనంతరం ఆ వ్యక్తి విజయం సాధించినట్లుగా విక్టరీ సింబల్ చూపించినట్లు వీడియోలో కనిపిస్తోంది. రోస్ట్ బీఫ్ శాండ్ విచ్ కోసం కస్టమర్లు ఎగురుకుంటూ వస్తున్నారని క్యాప్షన్ పెట్టడం విశేషం. ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఆహారం కోసం అంత దూరం వెళ్లాడని తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ పైలెట్‌ను ఇంకా గుర్తించాల్సి ఉంది.