దేశంలో 60శాతం జనాభాకు కరోనా సోకాలని కోరుకుంటున్న బ్రిటన్ ప్రభుత్వం, కారణమిదే

ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కమ్మేస్తోంది. అక్కడా ఇక్కడా అని కాదు ప్రపంచంలోని అన్ని దేశాలకూ వేగంగా విస్తరిస్తోందీ మహమ్మారి. 157 దేశాలకు పాకిన ఈ భూతం

  • Published By: veegamteam ,Published On : March 16, 2020 / 07:20 AM IST
దేశంలో 60శాతం జనాభాకు కరోనా సోకాలని కోరుకుంటున్న బ్రిటన్ ప్రభుత్వం, కారణమిదే

ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కమ్మేస్తోంది. అక్కడా ఇక్కడా అని కాదు ప్రపంచంలోని అన్ని దేశాలకూ వేగంగా విస్తరిస్తోందీ మహమ్మారి. 157 దేశాలకు పాకిన ఈ భూతం

ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కమ్మేస్తోంది. అక్కడా ఇక్కడా అని కాదు ప్రపంచంలోని అన్ని దేశాలకూ వేగంగా విస్తరిస్తోందీ మహమ్మారి. 157 దేశాలకు పాకిన ఈ భూతం వందల కోట్ల మందిని వణికిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బెంబేలెత్తిస్తోంది. ఓ రకంగా ప్రపంచమంతా ఈ వైరస్‌తో యుద్ధం చేస్తోంది. వైరస్ పాకిన దేశాలు దీన్ని కంట్రోల్‌ చేయడానికి తంటాలు పడుతుంటే… ఈ రాక్షసి తమ దేశంలోకి అడుగుపెట్టకుండా మిగిలిన దేశాలు ప్రయత్నిస్తున్నాయి. లక్షా 69వేల 500 మంది వైరస్ బారిన పడగా… ఇప్పటి వరకూ 6వేల 516 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో అమెరికా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆసియా వెలుపల వైరస్ ఉదృతంగా వ్యాప్తి చెందుతోంది. తూర్పు ఆఫ్రికాకూ ఈ మహమ్మారి పాకింది. కెన్యా, ఇథియోపియాల్లో తొలి కేసులు నమోదయ్యాయి. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ వెలుగు చూసింది. ఇప్పటివరకు దీనికి వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారు. కరోనాను కట్టడి చేయడం ఎలాగో తెలియక అంతా తలలు పట్టుకుంటున్నారు. 

ప్రజలందరికి కరోనా సోకాలి:
ప్రపంచ దేశాలన్నీ ఇలా కరోనాతో నిద్ర లేని రాత్రులు గడుపుతుంటే, భయాందోళనలో బతుకుతుంటే, బ్రిటన్ ప్రభుత్వం మాత్రం కరోనాకి వెల్ కమ్ చెబుతోంది. దేశ జనాభాలో 60శాతం మందికి కరోనా సోకాలని కోరుకుంటోంది. పౌరులకు కరోనా సోకాలని కోరుకోవడం ఏంటి? పిచ్చి కానీ పట్టిందా? అనే సందేహాలు మీకు రావొచ్చు. వినడానికి షాకింగ్ గా ఉండొచ్చు. కానీ ఇది నిజం. దీనికి కారణం లేకపోలేదు. కరోనాకి చెక్ పెట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం సరికొత్త వ్యూహం రచించింది. అదే హెర్డ్ ఇమ్యూనిటీ(herd immunity). అంటే మంద రోగ నిరోధక శక్తి. ఇన్ ఫెక్షన్ రేటు పెరగడం మంద రోగ నిరోధక శక్తి పెంపునకి తోడ్పడుతుందని అంచనా వేశారు.

హెర్డ్ ఇమ్యూనిటీ అంటే:
herd ఇమ్యూనిటీ (మంద రోగనిరోధక శక్తి) అంటే పెద్ద సంఖ్యలో ప్రజలకు ఒక వ్యాధికి టీకాలు వేసినప్పుడు, ఇతరులు దాని బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. జనాభాలో తగినంత శాతం మందికి టీకాలు వేసినప్పుడు, వ్యాధి వ్యాప్తిని తగ్గిస్తుంది. దీనిని కమ్యూనిటీ రోగనిరోధక శక్తి లేదా మంద రక్షణ అని కూడా పిలుస్తారు. తగినంత నిష్పత్తిలో రోగ నిరోధక శక్తి ఉన్నప్పుడు ఇన్ ఫెక్షన్లు తగ్గిపోతాయని, ఒకరి నుంచి మరొకరికి వ్యాధి వ్యాపించదని సైంటిస్టులు చెబుతున్నారు. నేచురల్ గానే దేహంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. దీని ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి ఇన్ ఫెక్షన్లు సోకే అవకాశం ఉండదన్నారు.

కాగా, కరోనా వైరస్ పై బ్రిటన్ చూపిన సాఫ్ట్ కార్నర్ విమర్శలకు దారి తీసింది. వైద్య నిపుణులు దీన్ని తప్పుపడుతున్నారు. వారి అంచనాలు తప్పొచ్చని, ఇతర పరిణామాలకు దారి తీయొచ్చని హెచ్చరించారు. ఈ విమర్శల తర్వాత ప్రభుత్వం కొంత తగ్గింది. హెర్డ్ ఇమ్యూనిటీ ప్రభుత్వ పాలసీ కాదని బ్రిటన్ హెల్త్, సోషల్ కేర్ సెక్రటరీ స్పష్టం చేశారు.

Also Read | CAAను వ్యతిరేకిస్తే దేశద్రోహులు అవుతారా?