ఆ హైవే మహిళల మృత్యు మార్గం : 50 ఏళ్లుగా వీడని  మిస్టరీ

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 06:37 AM IST
ఆ హైవే మహిళల మృత్యు మార్గం : 50 ఏళ్లుగా వీడని  మిస్టరీ

ప్రపంచంలో ఎన్నో వింతలు..విశేషాలు..ఇంకా ఎన్నో మిస్టరీ..ఈ మిస్టరీలను ఛేదించేందుకు ఎందరో యత్నిస్తుంటారు. కానీ కొన్ని మిస్టరీలుగా మిగిలిపోతుంటాయి. దాంట్లో ఓ మిస్టరీ. ఉత్తర అమెరికాలో కెనడాలోని ‘హైవే ఆఫ్ టియర్స్’ ఈ హైవేలో మహిళల పాలిట మృత్యు మార్గంగా తయారయ్యింది. ఇది నిన్నో మొన్నో కాదు గత 50 సంవత్సరాలుగా ఈ మిస్టరీ కొనసాగుతోంది. దీన్ని  ‘హైవే ఆఫ్ టియర్స్’ అని పేరు పెట్టారు. మిస్టరీ హైవే గురించి మనం కూడా తెలుసుకుందాం..
 

అది హైవే కాదు..మహిళల పాలిట మృత్యు మార్గం. ఆ మార్గం నుంచి ప్రయాణిస్తే..బాలికల నుంచి వృద్ధ మహిళల వరకు..ఎవరు ప్రాణాలతో బైటపడరు. అలా ఆ వైపుగా వెళ్లిన ఆడవారుఎవరైనా సరే..కొందరు శవాలుగా కనిపిస్తే..మరికొందరు అస్సలు కనిపించకుండా పోతున్నారు. ప్రిన్స్ జార్జ్ నుంచి ప్రిన్స్ రుపెర్ట్ వరకు గల ఈ  720 కిమీల హైవే జర్నీ మహిళలకు యమ డేంజర్. బ్రిటీష్ కొలంబియాలో భాగంగా ఉండే ఈ హైవేలో 1969 నుంచి మహిళలు మిస్ అవుతున్నారు. ఈ క్రమంలో మహిళల రక్షణ కోసం కెనడా పోలీసులు ఆ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గత 50 ఏళ్లలో అక్కడ 50 పైగా హత్యలు..మిస్సింగ్ కు జరిగాయని తెలుస్తోంది. వీరంతా మహిళలు, యువతులు, బాలికలే కావటం గమనించాల్సిన విషయం. 
 

ఈ హైవే పొడవునా చిన్న చిన్న ఊర్లలో నివసించేవారంతా పేదలే.ముఖ్య నగరాల్లోకి వెళ్లేందుకు వారికి ఎటువంటి ట్రాన్స పోర్స్ సౌకర్యం ఉండదు.దీంతో అక్కడి ప్రజలు హైవే పైకి వచ్చి వాహనాలను లిఫ్ట్ అడిగి ఎక్కుతారు. అలా ప్రయాణించిన మహిళల్లో చాలామంది కిడ్నాప్ కు  గురయ్యారు. దీంతో ఆ హైవేకి ‘హైవే ఆఫ్ టియర్స్’ (కన్నీటి రహదారి) అని పేరు పెట్టారు. ఈ నేరాలను దృష్టిలో పెట్టుకుని ఆ మార్గంలో మహిళలు ఎవరినీ లిఫ్ట్ అడిగి కార్లు ఎక్కవద్దని పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అంతేగాక, అటుగా వాహనాల్లో వెళ్లే మహిళలు.. ప్రయాణంలో ఎక్కడా ఆగవద్దని సూచిస్తున్నారు.ఫిర్యాదు అందిన వెంటనే చేరుకోడానికి హెలికాప్టర్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. అయినా..ఈ మహిళల మిస్సింగ్ మాత్రం జరుగుతునే ఉన్నారట. 

 

ఆ మార్గంలో తొలి హత్య 1969లో జరిగింది. 1974, డిసెంబరులో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న మోనిక ఇగ్నాస్ (14) అనే బాలిక 1975, ఏప్రిల్‌లో శవమై కనిపించింది. ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత నుంచి ఏడాదికి మూడు నుంచి పది వరకు మహిళలు అపహరణకు గురయ్యేవారు. తాజాగా జెస్సికా ప్యాట్రిక్ (18) ఏళ్ల యువతి అపహరణకు గురైంది. 2018, ఆగస్టు 31న మిస్సయిన ఆమె సెప్టెంబరు 6న శవమై కనిపించింది. 2018 డిసెంబరులో సింతియా మార్టిన్ అనే 50 ఏళ్ల మహిళ అపహరణకు గురైంది. ఆమె ఒంటరిగా కారులో ప్రయాణిస్తుండా గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఆమె కారు దొరికింది కానీ ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు.

ఈ హత్యలతో సంబంధం ఉందనే కారణంతో పోలీసులు కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అయినా ఫలితం దక్కలేదు. సుమారు 50 ఏళ్లుగా జరుగుతున్న ఈ అపహరణలు, హత్యలకు గల కారణాన్ని పోలీసులు తెలుసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఈ హత్యలు, అపహరణలు అంతు చిక్కని మిస్టరీగా ఉండిపోయాయి ఈనాటి వరకూ కూడా.