Japan : పది సంవత్సరాల నుంచి హోం ఐసోలేషన్..ఎందుకో తెలుసా

జపాన్ లోని టోక్యోకు చెందిన సౌజీ అనే వ్యక్తి గత పది సంవత్సరాలుగా హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నాడు. అయితే..అక్కడ హికికోమోరి అనే విధానం ఒకటి ఉందంట. సమాజానికి దూరంగా ఇంట్లోనే గడపడం దీని ముఖ్య ఉద్దేశ్యం. దీనిని చాలా మంది పాటిస్తున్నారంట.

Japan : పది సంవత్సరాల నుంచి హోం ఐసోలేషన్..ఎందుకో తెలుసా

Japan

Hikikomori  : ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా పది సంవత్సరాల నుంచి హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నాడు. కరోనా వైరస్ సోకితే..తప్పనిసరిగా ఇంట్లోనే నిర్భందంలో ఉండాలనే నిబంధనలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ..దీనికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. అయితే..ఈ వ్యక్తి మాత్రం ఇన్నేళ్లు హోం ఐసోలేషన్ లో ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే..దీనికో ఓ కారణం చెబుతున్నాడు అతను.

జపాన్ లోని టోక్యోకు చెందిన సౌజీ అనే వ్యక్తి గత పది సంవత్సరాలుగా హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నాడు. అయితే..అక్కడ హికికోమోరి అనే విధానం ఒకటి ఉందంట. సమాజానికి దూరంగా ఇంట్లోనే గడపడం దీని ముఖ్య ఉద్దేశ్యం. దీనిని చాలా మంది పాటిస్తున్నారంట. దాదాపు పది లక్షల మంది హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నారంట. ఇందులో యువకులు ఐదు లక్షల మంది ఉండగా..మరో ఐదు లక్షల మంది మధ్య వయస్కులకు చెందిన వారంట. సౌజీ కూడా ఇదే విధానం అనుసరిస్తున్నారు.

పదేళ్లుగా సమాజానికి దూరంగా ఉంటున్నాడు. బయటకు వెళ్లకుండా..ఎలా ఉంటాడు ? మరి తిండి..ఇతరత్రా అవసరాలు ఎలా ? అని అనుకుంటున్నారా ? ఆన్ లైన్ ఉండగా..ఇంకేం సమస్య ఉంది. కావలసినవన్నీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ ఇస్తాడంట. కేవలం మూడు నెలలకు మాత్రమే బార్బర్‌ షాపుకు వెళ్లేందుకు బయటకు వస్తాడట. ఇతను యూ ట్యూబ్ ఛానెల్ మెంటెన్ చేస్తున్నాడు. నీటో సౌజీ పేరుతో ఉన్న ఈ ఛానెల్‌లో తన రెగ్యులర్‌ జీవితాన్ని గురించి ఫాలోవర్లకు అప్‌డేట్స్‌ ఇస్తుంటాడు.