Hindu Woman : పాక్ లో తొలి హిందూ..మహిళా కలెక్టర్

పాక్ లో హిందూ యువతి సనా రామ్ చంద్ ఘనత సాధించింది. మహిళా సీసీఎస్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణురాలై...తొలి హిందూ మహిళా కలెక్టర్ కానున్నారు.

Hindu Woman : పాక్ లో తొలి హిందూ..మహిళా కలెక్టర్

Pakistan

Sana Ram Chand : పాక్ లో హిందూ యువతి సనా రామ్ చంద్ ఘనత సాధించింది. మహిళా సీసీఎస్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణురాలై…తొలి హిందూ మహిళా కలెక్టర్ కానున్నారు. హిందూ మహిళ ఆ దేశ సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యారు. భారతదేశంలో ఐఏఎస్..ఎలానో..పాక్ లో పీఏఎస్ కూడా అలాంటిదే. పీఏఎస్ అంటే..పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఇక్కడ యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్) తరహాలో..పాక్ లో సీసీఎస్ (సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్)..పరీక్ష నిర్వహిస్తారు.

ఈ పరీక్షను సనా రామ్ చంద్ మహిళ రాసింది. పరీక్షలో విజయం సాధించిన సనా రామ్‌చంద్‌… పాకిస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ (పీఏఎస్‌)కు ఎంపికయ్యారు. తద్వారా ఆ దేశంలో తొలి హిందూ మహిళా కలెక్టర్‌ కానున్నారు. 18,553 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. 221 మంది ఉత్తీర్ణులు కాగా వారిలో 79 మంది మహిళలు ఉన్నారు. పాక్‌లో హిందువులు ఎక్కువగా ఉండే సింధ్‌ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతానికి సనా చెందిన వారు. ఈమె ఎంబీబీఎస్‌ పూర్తిచేసి డాక్టర్‌గా పని చేస్తున్నారు. సివిల్‌ సర్వీసెస్‌పై ఆసక్తితో సీఎస్‌ఎస్‌ పరీక్ష రాశారు.

Read More : Telangana : స్టార్ హోటల్స్ లో గదులు సిద్ధం చేసిన..కార్పొరేట్ ఆసుపత్రులు..పూర్తి వివరాలు