April Fools Day 2023 : ఏప్రిల్ ఫూల్స్ డే వెనక చరిత్ర ..ఏంటంటే?

ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నాడు ఏప్రిల్ ఫూల్స్ డే జరుపుకుంటారు. ఈరోజు కొంతమంది జోకులు, ప్రాంక్స్, అబద్ధాలు చెప్పి స్నేహితుల్ని, ఇరుగు పొరుగువారిని ఫూల్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి ఎదుటివారి వల్ల కూడా ఫూల్స్ అవుతుంటారు. ఇంతకీ ఏప్రిల్ ఫూల్స్ డే హిస్టరీ ఏంటి?

April Fools Day 2023 : ఏప్రిల్ ఫూల్స్ డే వెనక చరిత్ర ..ఏంటంటే?

April Fools Day 2023

April Fools Day 2023 : ఏటా ఏప్రిల్ 1 ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూసేవాళ్లు ఉన్నారు. ఏటా ఆరోజు ఏప్రిల్ ఫూల్స్ (April Fools’ Day) డే గా జరుపుకుంటారు. జరగనిది జరిగినట్లు చెప్పడానికో, ఎవరినైనా ఆట పట్టించడానికో, భయపెట్టడానికో ఏదో ఒకటి చేసి ఎదుటి వ్యక్తిని నమ్మించి ఫూల్స్ చేస్తుంటారు కొందరు. ఏంటో వీరికి ఇంత సరదా.. అనుకుంటాం. మనం కూడా అలాంటి వారి మాటలు నమ్మేసి అవుతుంటాం. ఒక్కోసారి వాళ్లు చేసే ప్రాంక్స్ ఫలించక తిరిగి వారే ఫూల్స్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి.

Britain Triplets Guinness Records : ఆరు నెలల్లోపే పుట్టి ఆరోగ్యంగా ఉన్న ముగ్గురు కవలలు గిన్నీస్ రికార్డ్

చిన్న పిల్లలు సైతం ఏప్రిల్ ఫూల్స్ డేన ఏదో ఒకటి చెప్పి ఇంట్లో వారిని ఫూల్స్ చేయాలని చూస్తుంటారు. గోడ మీద బల్లి ఉందనో.. కాలు దగ్గర కాక్రోచ్ ఉందనో చెప్పి సరదాగా ఆటపట్టిస్తుంటారు. ఇదంతా సరే కానీ చాలామందికి అసలు ఏప్రిల్ ఫూల్స్ డే వెనక కథ ఏంటో తెలియకపోవచ్చు. నిజానికి ఈ డే జరపడం వెనుక పూర్తి ఆధారాలు లేకపోయినప్పటికీ రోమన్లు (romans) జరుపుకునే పండుగ హిలేరియా (Hilaria ) నుంచి ప్రేరణగా ఈ డే జరుపుతారని అంటారు. ఇదే రోజున రోమ్ చక్రవర్తి తన భార్య పుట్టినరోజుని జరపాలని నగర ప్రజలకు చెప్పాడట. నిజానికి ఆరోజు ఆమె పుట్టినరోజు కాదని చెబుతారు. అదేంటని అడిగితే ప్రజలు ఫూల్స్ అవుతామని భావించారట.

Salaar : ఇటలీ మీడియాలో ‘సలార్’ గురించి న్యూస్.. ఏంటో తెలుసా?

ఇక 1582 లో ఫ్రాన్స్ లో ప్రజలు క్యాలెంటర్ ను ఏ మాత్రం సరిగా గమనించక ఏప్రిల్ 1న కొత్త సంవత్సరంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారట. జూలియన్ క్యాలెండర్ (Julian calendar) నుంచి గ్రెగోరియన్ క్యాలెండర్ (Gregorian calendar) కి మారుతున్నప్పుడు ఆ మార్పును వారు గమనించలేదట. అలా చేయడం వల్ల వారందరిని ఫూల్స్ అని పిలిచేవారని .. అప్పటి నుంచి ఏప్రియల్ 1 న ఫూల్స్ డే జరుతున్నారని అంటారు.

నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిది అని అందరూ నమ్ముతున్న తరుణంలో ఏప్రిల్ ఫూల్స్ డేకి నిజంగా ప్రాధాన్యత పెరిగినట్లే. ఎందుకంటే సరదా జోక్స్, ప్రాంక్స్ (prank) వల్ల ఈ ఒక్కరోజు కూడా అందరూ మనసారా నవ్వుకోవచ్చు.