అంతరిక్షయానంలో SpaceX చరిత్ర, ప్రైవేట్ స్పేస్ షిప్ లో అంతరిక్షంలోకి NASA వ్యోమగాములు

అంతరిక్షయానం చరిత్రలో సరికొత్త శకం మొదలైంది. తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ.. వ్యోగాములను అంతరిక్షంలోకి

  • Published By: naveen ,Published On : May 31, 2020 / 05:07 AM IST
అంతరిక్షయానంలో SpaceX చరిత్ర, ప్రైవేట్ స్పేస్ షిప్ లో అంతరిక్షంలోకి NASA వ్యోమగాములు

అంతరిక్షయానం చరిత్రలో సరికొత్త శకం మొదలైంది. తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ.. వ్యోగాములను అంతరిక్షంలోకి

అంతరిక్షయానం చరిత్రలో సరికొత్త శకం మొదలైంది. తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ.. వ్యోగాములను అంతరిక్షంలోకి పంపింది. ఎలన్ మస్క్(Elon Musk) సారథ్యంలోని స్పేస్ఎక్స్(SpaceX) సంస్థ చెందిన ఫాల్కన్ 9 రాకెట్.(Falcon 9 Rocket). ఇద్దరు నాసా వ్యోమగాములతో(NASA Astronauts) ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు(ఐఎస్ఎస్) పయనమైంది. నాసాకు చెందిన రాబర్ట్ బెహ్‌కిన్(49), డగ్లస్ హర్లీలు(53) ఫాల్కన్ 9 రాకెట్‌పై అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.22కు దాదాపు 450 కిమీల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్‌ దిశగా ప్రయాణం ప్రారంభించారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పే సెంటర్ ఈ ప్రయోగానికి వేదికైంది.

ఓ ప్రైవేటు సంస్థ చేపట్టిన తొలి మానవసహిత అంతరిక్షయానం ఇదే:
స్పెస్ ఎక్స్ సంస్థ.. ఈ మిషన్‌కు డెమో-2గా నామకరణం చేసింది. రాకెట్ ప్రయాణం విజయవంతంగా ప్రారంభమవడంతో అంతరిక్షయానంపై ప్రభుత్వ సంస్థల గుత్తాధిపత్యానికి ముగింపు చెప్పినట్టైంది. ఓ ప్రైవేటు సంస్థ చేపట్టిన తొలి మానవసహిత అంతరిక్షయానం ఇదే కావడంతో స్పెస్ ఎక్స్ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. ‘మా అందరి కల నెరవేరింది’ అని ఈ సందర్భంగా సంస్థ అధినేత అన్నారు. 

ఇక నిరంతర మావనసహిత అంతరిక్షయానం:
ఇది విజయవంతంగా పూర్తయిన తరువాత.. సంస్థకు చెందిన డ్రాగన్ కాప్సుల్‌తో నిరంతరం మావనసహిత అంతరిక్షయానం చేపట్టేందుకు స్పేస్‌ ఎక్స్ సంస్థకు నాసా అనుమతి లభిస్తుంది. దాదాపు 19 గంటల పాటు జరిగే ఈ ప్రయాణం.. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాకెట్.. స్పేస్ స్టేషన్‌కు చేరుకోవడంతో పూర్తవుతుంది. ఇప్పటికే ఐఎస్ఎస్‌లో ప్రయోగాలు చేపడుతున్న వ్యోమగాములు క్రిస్ కాసిడీ, అనటోలీ ఇవానిషిన్‌లు అమెరికా ఆస్ట్రోనాట్లకు స్వాగతం పలకనున్నారు.

3

అమెరికా కలం సాకారం:
ఈ ప్రయోగంతో దాదాపు దశాబ్ద కాలంగా వేచిచూస్తున్న అమెరికా కల సైతం సాకారమైంది. 2011లో చివరిసారి అమెరికా గడ్డపై నుంచి వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. ఆ ప్రయోగంతో అమెరికా వ్యోమనౌక రిటైర్‌ కావడంతో నాటి నుంచి రష్యాకు చెందిన సూయజ్‌ అంతరిక్ష నౌకలోనే ఐఎస్‌ఎస్‌కు వెళ్తున్నారు. దీనికోసం రష్యాకు అమెరికా భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. చంద్రుడు, అంగారక గ్రహంపైకి వెళ్లే ప్రాజెక్టుల్లో నాసా తలమునకలై ఉంది. దీంతో ఐఎస్‌ఎస్‌ సహా ఇతర రోదసీయానాలకు అవసమయ్యే వ్యోమనౌకల నిర్మాణాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఇందుకు ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌, మరో ప్రముఖ సంస్థ బోయింగ్ ముందుకు వచ్చాయి. తాజాగా స్పేస్‌ఎక్స్‌ తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పటికే పలుసార్లు స్పేస్‌ఎక్స్‌ నిర్మించిన డ్రాగన్‌ ఐఎస్‌ఎస్‌కు సరకులను మోసుకెళ్లిన అనుభవం ఉండడం గమనార్హం.

అంగారక గ్రహంపై జనావాసాల ఏర్పాటే లక్ష్యం:

భవిష్యత్తులో అంగారక గ్రహంపై జనావాసాల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్న స్పేస్‌ ఎక్స్‌ ఈ ప్రయోగాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించింది. మనుషుల్ని మోసుకెళ్లడంలో తమ సామర్థ్యం నిరూపించేందుకు అవకాశంగా వినియోగించుకుంది. అలాగే, ‘స్పేస్‌ఎక్స్‌ డెమో-2’గా పేర్కొన్న ఈ మిషన్‌ విజయవంతం కావడంతో నాసాతో చేసుకున్న 2.6 బిలియన్‌ డాలర్ల ఒప్పందం ప్రకారం ఐఎస్ఎస్‌కు పంపే తమ ఆరు ఆపరేషనల్ మిషన్లను కొనసాగించేందుకు స్పేస్ ఎక్స్‌కు మార్గం సుగమం కానుంది.

స్పేస్‌ఎక్స్‌ కల సాకారమైందంటూ ఎలన్‌ మస్క్‌ ఆనందం:
ఈ ప్రయోగంతో స్పేస్‌ఎక్స్‌ కల సాకారమైందంటూ ఎలన్‌ మస్క్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయంలో స్పేస్‌ఎక్స్‌, నాసా సహా ఇతర భాగస్వాముల కృషి ఎంతో ఉందని తెలిపారు. చాలా కాలం తర్వాత అమెరికా గడ్డపై నుంచి అమెరికా వ్యోమగాముల్ని రోదసీలోకి పంపడం ఆనందంగా ఉందని నాసా అడ్మినిస్ట్రేటర్‌ జిమ్ బ్రిడెన్‌స్టైన్‌ అన్నారు.

1