H&M Suit Hire Free : జాబ్ ఇంటర్వ్యూకు వెళ్తున్నారా? ఈ సూట్ 24 గంటలు ఉచితంగా అద్దెకు తెచ్చుకోవచ్చు!

జాబ్ ఇంటర్వ్యూకు వెళ్తున్నారా? అయితే మీదగ్గర సూట్ లేదా? సూట్ కోసం ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ కోసం హెచ్ఎండ్ఎం అనే కంపెనీ 24 గంటల పాటు సూట్ ను అద్దెకు ఆఫర్ చేస్తోంది.

H&M Suit Hire Free : జాబ్ ఇంటర్వ్యూకు వెళ్తున్నారా? ఈ సూట్ 24 గంటలు ఉచితంగా అద్దెకు తెచ్చుకోవచ్చు!

H&m Offers Free 24 Hour Suit Hire To Help Those With Job Interviews

H&M Free 24-hour Suit Hire : జాబ్ ఇంటర్వ్యూకు వెళ్తున్నారా? అయితే మీదగ్గర సూట్ లేదా? సూట్ కోసం ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ కోసం హెచ్ఎండ్ఎం అనే కంపెనీ ఉచితంగా సూట్ ఆఫర్ చేస్తోంది. అది కూడా ఉచితంగా.. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లేవారికి 24 గంటల పాటు సూట్ ను అద్దెకు ఆఫర్ చేస్తోంది. ఈ బ్రాండ్ సూట్ ఫస్ట్ లేదా సెకండ్ హ్యాండ్ సూట్ లు కూడా ఉన్నాయి. జాబ్ ఇంటర్వ్యూకు వెళ్లే నిరుదోగ్యులు తమ స్కిల్స్ కాన్ఫిడెంట్ గా ప్రదర్శించేందుకు వీలుగా H&M కంపెనీ ఈ చక్కని అవకాశం కల్పిస్తోంది.

సూట్ ధరించిన తర్వాత వారిలో కాన్ఫిడెంట్ లెవల్స్ పెరుగుతాయని కంపెనీ అంటోంది. సూట్ ధరిస్తే స్టయిల్ గా ఉంటారు.. అలాగే క్లాసిక్ లుక్ లో ఇంటర్వ్యూలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారంటోంది. ఈ బ్రాండ్ సూట్ కావాలనుకునే వారంతా ఆన్ లైన్ లో ముందుగానే రిజర్వ్ చేసుకోవాలంట.. అనేక రకాల సైజుల్లో సూట్ అందుబాటులో ఉంది. ఆన్ లైన్ లో సూట్ బుక్ చేసుకుంటే ఇంటికే డోర్ డెలివరీ అవుతుంది. 24 గంటల పాటు సూట్ అద్దెకు తెచ్చుకోవచ్చు. ఎలాంటి ఛార్జీ ఉండదు. 24 గంటల తర్వాత కంపెనీకి ఈ సూట్ తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. సూట్ తిరిగి ఇచ్చిన తర్వాత H&M కంపెనీనే దాన్ని వాష్ చేస్తుంది.. డ్రై క్లీనింగ్ చేస్తుంది.

ఒకవేళ సూట్ 24 గంటల తర్వాత తిరిగి ఇవ్వని పక్షంలో లేటు ఫీజుగా 50 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని ఛారిటీకి డొనేట్ చేస్తుంది. ఒకవేళ సూట్ అద్దెకు తీసుకున్నప్పుడు ఏదైనా మేజర్ డ్యామేజ్ అయితే దాని కూడా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. అలాగైన సూట్ జాగ్రత్తగా వాడుతారని ఉద్దేశంతో పెనాల్టీ వేస్తున్నామని కంపెనీ చెబుతోంది. వాస్తవానికి ఈ సూట్ అసలు ఖరీదు 116.94 పౌండ్లు.. అంట.. ఏ మ్యారేజీకో లేదా ఏదైనా పార్టీకో ఇవ్వడం కంటే.. ఇలా జాబ్ ఇంటర్వ్యూకు వెళ్లేవారికి ఇవ్వడమే సరైనదిగా కంపెనీ చెబుతోంది.

ప్రస్తుతం పురుషుల కోసం ఒకే ఒక సూట్ సెక్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. XS నుంచి XXL వరకు పలు రకాల సైజుల్లో సూట్లు ఉన్నాయి. నేవీ బ్లూ సింగిల్ బ్రెస్టెడ్ జాకెట్, మ్యాచింగ్ ట్రజర్స్, వైట్ షర్ట్, నేవీ బ్లూ టై, రెడ్ పాకెట్ స్వెయిర్ కూడా అందిస్తోంది. గత వారమే ఈ స్కీమ్ యూకేలో మొదలైంది. మే 13 నుంచి అమెరికాలో స్కీమ్ టెస్ట్ రన్ ప్రారంభమైంది.