Hog hotel : పందుల కోసం 13 అంతస్తుల స్టార్ హోటల్స్..CC కెమెరాలతో 24 గంటలు హై సెక్యూరిటీ..

పందుల కోసం రాజసౌధాలను తలపించే 13 అంతస్థుల స్టార్ హోటల్ ను నిర్మించింది చైనా. ఈ పందుల భద్రత కోసం 24 గంటల పాటు సెక్యూరిటీ కెమెరాలు కాపలాగా ఉంటాయి. హోటల్‌లో పనిచేసే సిబ్బంది, పరిశోధకులు లోనికి వెళ్లేటప్పుడు వారు వేసుకున్న దుస్తులను తొలగించి.. బయోసేఫ్టీ ల్యాబోరేటరీలోని ప్రత్యేక డ్రెస్సులు వేసుకోవాలి. అంతేకాదు శానిటైజర్‌ షవర్‌ కింద కాసేపు ఉండాలి. వాటి ఆరోగ్యం బాద్యతలను ప్రత్యేక రోబోలు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి.

Hog hotel : పందుల కోసం 13 అంతస్తుల స్టార్ హోటల్స్..CC కెమెరాలతో 24 గంటలు హై సెక్యూరిటీ..

Hog Hotels 10000 Pigs Kept In High Security Building In China To Keep Out Swine Flu And Other Viruses

Hog hotel  In Chaina : పందుల కోసం చిన్న చిన్న గుడిసెల్లాంటివి నిర్మిస్తారు. కానీ పందుల కోసం ఏకంగా రాజసౌధాలను తలపించే 13 అంతస్థుల స్టార్ హోటల్ ను నిర్మించింది చైనా. దక్షిణ చైనాలో అధికారులు పందుల కోసం ఈహోటల్ నిర్మించారు. ఈ హోటల్ లో 10 వేల పందులు ఉండటానికి అత్యంత ఆధునిక ఏర్పాట్లు చేశారు. ఈ పందుల భద్రత కోసం 24 గంటల పాటు సెక్యూరిటీ కెమెరాలు కాపలాగా ఉంటాయి.ప్రతీ అంగుళానికి ఓ కెమెరా ఉందా అన్నంతగా ఉంటాయి.ప్రతీ అంగుళాన్ని జల్లెడపడుతుంటాయి.

నిర్వాహకులు అనుమతి లేకుండా ఆ భవనంలోకి చిన్న చీమ కూడా పోవటానికి లేదు. ఎవరూ లోనికి ప్రవేశించలేని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పందులు తినే ఆహారం, ఆరోగ్య సేవల విషయంలో నిపుణులు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇంత టెక్నాలజీతో ఇన్ని అత్యాధునిక సౌకర్యాలతో పందుల కోసం ఉన్నాయి అంటే ఇక ఆ పందులది రాజభోగమేన్నమాట. ఇత ఈ హై-సెక్యూర్డ్‌ భవనాల్లో పందులు నివసిస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఇది నిజం. ఇంతకీ పందుల కోసం చైనా ఇంత ఖర్చు ఎందుకు పెడుతోంది? ఎందుకంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు అంటే..

ఈ హోటల్‌ను ‘హాగ్‌ హోటల్‌ (వరాహాల హోటల్‌)’గా పిలుస్తున్నారు. ఈ హోటల్‌లో దాదాపు 10 వేల వరాహాలు ఉండేలా సకల సౌకర్యాలు ఏర్పాటుచేశారు. బీజింగ్‌కు సమీపంలోని పింగూ జిల్లాలో 20 ఫుట్‌బాల్‌ స్టేడియంల విస్తీర్ణంలో ఐదంతస్తులతో మరో భారీ హోటల్‌ను ఇటీవల పూర్తిచేశారు. ఏడాదికి 1.20 లక్షల చొప్పున పందుల సంతానోత్పత్తే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. ‘హాగ్‌ హోటల్‌’ల నిర్మాణంలో ముయాన్‌ ఫుడ్స్‌, న్యూహోప్‌ గ్రూప్‌ వంటి కంపెనీలు పాలుపంచుకుంటున్నాయి.

చైనీయులు మాంసం ప్రియులనే విషయం తెలిసిందే. దాదాపు అన్నింటిని తింటారు. అలా చైనీయులు తినే ప్రధాన ఆహారాల్లో పంది మాంసం కూడా ఒకటి. 2018లో దేశంలో విజృంభించిన ఆఫ్రికా స్వైన్‌ ఫీవర్‌ వల్ల 40 కోట్ల పందులు చచ్చిపోయాయి. దేశంలోని మొత్తం పందుల్లో ఇది సగం భాగం. దీంతో పంది మాంసం ధర అమాంతం పెరిగిపోయింది. దీంతో పంది మాంసం దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల గత ఎనిమిదేళ్లలో గతంలో ఎప్పుడూ లేనంత ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దీంతో చైనా ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టటంలో భాగంగా పందుల మీద వైరస్‌ ప్రభావం పడకుండా..వాటి సంతతిని పెంచాలని నిర్ణయించింది. దీనికి పరిష్కారంగానే బయోసెక్యూరిటీ (వైరస్‌లు దూరకుండా పటిష్టమైన రక్షణ) వలయంలో పందుల పెంపకం చేపట్టింది. దీంట్లో భాగంగానే ‘హాగ్‌ హోటల్స్‌’ ఏర్పాటయ్యాయి.

హాగ్‌ హోటల్‌లో ఉండే పందులకు ఒక విధంగా రాజభోగమేనని చెప్పాలి. బయోసెక్యూరిటీలో ఉండే ఈ పందులకు మూడు అంచెలుగా టెస్ట్ చేసిన ఆహారాన్ని పెడతారు. నిరంతరం సెక్యూరిటీ కెమెరాల నిఘాలోనే పందులు ఉంటాయి. బయటి వ్యక్తులను ఎవరినీ లోపలికి అనుమతించరు. హోటల్‌లో పనిచేసే సిబ్బంది, పరిశోధకులు లోనికి వెళ్లేటప్పుడు వారు వేసుకున్న దుస్తులను తొలగించి.. బయోసేఫ్టీ ల్యాబోరేటరీలోని ప్రత్యేక డ్రెస్సులు వేసుకోవాలి. అంతేకాదు శానిటైజర్‌ షవర్‌ కింద కాసేపు ఉండాలి.

జలుబు, జ్వర లక్షణాలు ఉంటే లోపలికి ఎంట్రీ ఉండదు. పందులకు ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే పశువైద్యుల చికిత్స అందిస్తారు. ఈ చికిత్సకు ఎంత ఖర్చు అయినా వెనుకాడరు. పందుల్ని ఉంచిన ప్రదేశాల్లో శానిటైజేషన్‌, గాలిని ఫిల్టర్ చేయటం, ఆహారాన్ని అందించడానికి స్పెషల్ గా రోబోలు పనిచేస్తుంటాయి. పందులకు అస్వస్థతగా ఉందా? వాటి శరీర ఉష్ణోగ్రత ఎంత? వంటి పనులన్నీ రోబోలే చూస్తాయి. ఇదండీ వరాహాల రాజభోగం. దటీజ్ చైనా. డ్రాగన్ దేశం ఏం చేసినా ఓ స్పెషాలిటి ఉండాల్సిందే.