Covid-19: పెంపుడు జంతువులను హతమార్చి కరోనా కట్టడి

కరోనా కట్టడి నిమిత్తం పెంపుడు జంతువులైనప్పటికీ వాటిని అంతమొందించి వ్యాప్తిని అరికట్టే ప్రయత్నం చేస్తుంది చైనా ప్రభుత్వం. ఈ క్రమంలోనే చైనాలోని హాంకాంగ్ లో జంతువుల దుకాణంలో అత్యధిక..

Covid-19: పెంపుడు జంతువులను హతమార్చి కరోనా కట్టడి

pet animals

Covid-19: కరోనా కట్టడి నిమిత్తం పెంపుడు జంతువులైనప్పటికీ వాటిని అంతమొందించి వ్యాప్తిని అరికట్టే ప్రయత్నం చేస్తుంది చైనా ప్రభుత్వం. ఈ క్రమంలోనే చైనాలోని హాంకాంగ్ లో జంతువుల దుకాణంలో అత్యధిక సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులో పనిచేసే వ్యక్తికి డెల్టా వేరియంట్ కారణంగా పాజిటివ్ రావడంతో అక్కడ ఉన్నవారందరికీ వ్యాప్తి చెందింది.

ముందస్తు జాగ్రత్తగా అధికారులు వేల సంఖ్యలో సిబ్బందిని క్వారంటైన్ కేంద్రాలకు పంపించారు. ఆ దుకాణంలోని కుందేళ్లు, ఎలుక జాతికి చెందిన ఇతర జీవాల(హ్యామ్‌స్టర్)కు పరీక్షలు జరిపారు. 11 హ్యామ్‌స్టర్లకు పాజిటివ్ వచ్చింది. ఆ దుకాణంతో పాటు పరిసరాల్లోని 34 దుకాణాల్లో ఉండే దాదాపు 2వేల హ్యామ్‌స్టర్లను చంపితేనే వ్యాప్తి కట్టడి చేయగలమని నిర్ణయించుకున్నారు.

పెంచుకునేందుకు డిసెంబర్ 22 తర్వాత కొనుగోలు చేసిన వారు.. వాటిని తమకు అప్పగించాలని చెప్పారు. వీధుల్లో వదలకుండా తామే సేకరించేందుకు గానూ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి : నైట్ కర్ఫ్యూ షురూ.. బయటకు వెళ్తే చర్యలు

‘పెంపుడు జంతువుల నుంచి మానవులకు వైరస్‌ వ్యాప్తికి ఎటువంటి ఆధారాలు లేవు. హ్యామ్‌స్టర్‌ల దిగుమతులు, అమ్మకాలపై నిషేధం విధించారు. ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని హాంకాంగ్‌ ఆరోగ్య కార్యదర్శి సోఫియా చాన్ ఓ సమావేశంలో వెల్లడించారు. హ్యామ్‌స్టర్‌లను పెంచుతున్నవారు వాటిని బయటకు తీసుకురావద్దని సూచించారు.