Pak army chief: సైనిక వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండేలా చూడాలి: కొత్త ఆర్మీ చీఫ్‌కు పాక్ మీడియా సూచన

పాకిస్థాన్ రాజకీయాల్లో ఆర్మీ జోక్యం బాగా ఉంటుందని విమర్శలు ఉన్నాయి. రాజకీయాలు, విదేశాంగ విధానాన్ని పాక్ ఆర్మీ ప్రభావితం చేస్తుంటుంది. పాక్ లో మూడుసార్లు(1958–1971, 1977–1988, 1999–2008) సైనిక పాలన కొనసాగింది. దీంతో కొత్తగా నియమితుడవుతున్న ఆర్మీ చీఫ్ తన సైనిక వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉండేలా చూడాలని పాక్ మీడియా పెద్ద ఎత్తున కథనాలు రాసుకొచ్చింది.

Pak army chief: సైనిక వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండేలా చూడాలి: కొత్త ఆర్మీ చీఫ్‌కు పాక్ మీడియా సూచన

Lieutenant General Asim Munir will be Pakistan's next Army chief

Pak army chief: పాకిస్థాన్ రాజకీయాల్లో ఆర్మీ జోక్యం బాగా ఉంటుందని విమర్శలు ఉన్నాయి. రాజకీయాలు, విదేశాంగ విధానాన్ని పాక్ ఆర్మీ ప్రభావితం చేస్తుంటుంది. పాక్ లో మూడుసార్లు(1958–1971, 1977–1988, 1999–2008) సైనిక పాలన కొనసాగింది. దీంతో కొత్తగా నియమితుడవుతున్న ఆర్మీ చీఫ్ తన సైనిక వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉండేలా చూడాలని పాక్ మీడియా పెద్ద ఎత్తున కథనాలు రాసుకొచ్చింది.

పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా నవంబరు 29న పదవీ విరమణ చేస్తున్నారు. పాక్ ఆర్మీ కొత్త చీఫ్ గా ఐఎస్ఐ మాజీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండు రోజుల క్రితం బజ్వా మాట్లాడుతూ… ఆర్మీ భవిష్యత్తులోనూ రాజకీయాలకు దూరంగా ఉంటుందని చెప్పారు. దేశానికి ఆర్మీ మాజీ చీఫ్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు రాజకీయాలకు దూరంగా కొత్త చీఫ్ ఉండాలని పాక్ మీడియా పేర్కొంది.

‘‘హార్డెస్ట్ రీసెట్’’ పేరిట పాక్ మీడియా సంస్థ డాన్ ఓ కథనాన్ని ప్రచురించింది. హద్దులకు మించి జోక్యం చేసుకోవాలంటూ ఆర్మీ చీఫ్ ను పాక్ లో ఉన్న ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పింది. పాకిస్థాన్ ను అంతర్గతంగా, సరిహద్దుల వద్ద సురక్షితంగా ఉంచే అంశంపై మాత్రమే ఆర్మీ దృష్టి పెట్టాలని చెప్పింది. ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..