India-UK FTA..PM Rishi Sunak : భారత్-బ్రిటన్ మధ్య పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఆశలు ..ఆ దిశగా రిషి సునక్ చొరవ తీసుకుంటారా?

ఒకప్పుడు బ్రిటీష్ వలసరాజ్యంగా ఉన్న భారత్‌ను.. ఇప్పుడు అలా చూడటం కుదరదు. ఈ విషయంలో.. రిషి సునక్ పూర్తి క్లారిటీతో ఉన్నారు. భారత్‌కు ఏదో మేలు చేయాలన్న ఆలోచన కూడా రిషికి లేనట్లుగానే ఉంది. కానీ తనను నమ్మి.. అధికార పీఠాన్ని అప్పజెప్పిన దేశానికి.. కమిట్‌మెంట్‌తో పనిచేసేందుకే సునక్ ప్రాధాన్యత ఇస్తారు. అయితే.. ప్రధానంగా భారత్-బ్రిటన్ మధ్య పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై.. రెండు దేశాలు సంతకం చేస్తాయా? లేదా? అన్నదే మోస్ట్ ఇంట్రస్టింగ్ గాఉంది..

India-UK FTA..PM Rishi Sunak : భారత్-బ్రిటన్ మధ్య పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఆశలు ..ఆ దిశగా రిషి సునక్ చొరవ తీసుకుంటారా?

India-UK FTA..PM Rishi Sunak

India-UK FTA..PM Rishi Sunak : ఒకప్పుడు బ్రిటీష్ వలసరాజ్యంగా ఉన్న భారత్‌ను.. ఇప్పుడు అలా చూడటం కుదరదు. ఈ విషయంలో.. రిషి సునక్ పూర్తి క్లారిటీతో ఉన్నారు. భారత్‌కు కచ్చితంగా ఏదో మేలు చేయాలన్న ఆలోచన కూడా ఆయన ప్రదర్శించడం లేదు. తనను నమ్మి.. అధికార పీఠాన్ని అప్పజెప్పిన దేశానికి.. కమిట్‌మెంట్‌తో పనిచేసేందుకే సునక్ ప్రాధాన్యత ఇస్తారు. అయితే.. ప్రధానంగా భారత్-బ్రిటన్ మధ్య పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై.. రెండు దేశాలు సంతకం చేస్తాయా? లేదా? అన్నదే మోస్ట్ ఇంట్రస్టింగ్ గాఉంది..

బ్రిటన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం, ఇలాంటి పరిస్థితుల్లో.. భారత మూలాలున్న రిషి సునక్ ఆ దేశానికి ప్రధాని కావడమనే విషయాన్ని కాసేపు పక్కనబెట్టి చర్చించుకోవాల్సిన కీలక విషయం ఒకటుంది. అదే.. భారత్-బ్రిటన్ మధ్య స్తంభించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని పునరుద్ధరించడం. ఇప్పుడు.. రిషి సునక్ ముందున్న ప్రధాని విధి ఇదే అవుతుంది. గత జనవరిలో రెండు దేశాలు దీనిపై చర్చలు జరిపాయ్. లెదర్, జ్యువెలరీ, టెక్స్‌టైల్స్, ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెరగాలని.. విద్యార్థులకు, వ్యాపారులకు మరిన్ని వీసాలు లభించాలని భారత్ ఆశిస్తోంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేసి 8 లక్షల కోట్లకు పైగా పెంచాలనే లక్ష్యంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌పై చర్చలు ప్రారంభించారు.

UK PM Rishi Sunak : బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునక్ వల్ల భారత్‌కు మేలు జరుగుతుందా?

అయితే.. లిజ్‌ ట్రస్‌ ప్రధానిగా ఉండగా అప్పటి బ్రిటన్ హోం సెక్రటరీ సుయెల్లా బ్రావర్మన్ భారత్‌పై విషం గక్కారు. మన సంతతికి చెందిన వ్యక్తే అయినా.. భారత్‌పై అక్కసు వెళ్లబోసుకున్నారు. వీసా గడువు తీరిపోయినా.. బ్రిటన్‌లోనే నివాసముంటున్న వారిలో భారతీయ వలసదారులే ఎక్కువగా ఉన్నారని.. ఈ ఒప్పందం వల్ల ఇండియా నుంచి మరిన్ని వలసలు పెరుగుతాయంటూ విమర్శించారు. దీనిపై కొంత వివాదం రేగడంతో ఎఫ్‌టీఏ ఒప్పందం ఇక్కట్లలో పడింది. ఆమె పదవికి రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. అయితే.. రిషి సునక్ కొత్త పీఎంగా ఎన్నికయ్యారు కాబట్టి.. భారత్-బ్రిటన్ మధ్య ఉన్న సంబంధాలను భిన్నంగా చూడాల్సిన అవసరముంది. ఎందుకంటే.. బ్రిటన్‌లో ఉన్న వాళ్లు ఇండియా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ.. రిషి సునక్ గత ఆగస్టులో భారత సంతతితో నిర్వహించిన ప్రచారంలో చెప్పారు. బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన భారత్‌తో.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు చేసుకునేందుకు తాను కట్టుబడి ఉన్నానని రిషి సునక్ ఇంతకుముందే చెప్పారు. అయితే.. భారత్‌పై వివాదాస్పద కామెంట్లు చేసిన సుయెల్లా బ్రావర్మన్‌ని మళ్లీ తన టీమ్‌లో రిషి సునక్ చేర్చుకోవడమే.. ఈ ఇష్యూపై కొత్త సందేహాలు లేవనెత్తుతోంది.

ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్.. ఇరు దేశాలకు ప్రయోజనకరమని, ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని రిషి సునక్ భావిస్తున్నారు. భారత కంపెనీలు.. బ్రిటన్ కంపెనీలతో కలిసి పని చేసేలా తమ విధానాలను సరళీకరిస్తామన్నారు. అంతేకాదు.. బ్రిటన్ విద్యార్థులు భారత్‌కు వెళ్లి నేర్చుకునే అవకాశాలు కూడా కల్పిస్తామన్నారు. భారత్-బ్రిటన్ సంబంధాలు సమఉజ్జీల మధ్య భాగస్వామ్యం లాంటివని.. ఎవరూ ఎక్కువ, తక్కువ కాదన్నారు రిషి సునక్. ఇండియాలో ఏం అమ్మొచ్చు.. ఏం చేయొచ్చనేదే కాకుండా.. భారత్ నుంచి బ్రిటన్ ఏం నేర్చుకోవాలో కూడా చూడాలన్నారు. ప్రపంచస్థాయి ఆలోచనలు, ఆవిష్కరణలకు భారత్-బ్రిటన్ సరికొత్త అవకాశాలను కల్పించుకోవాలని సూచించారు.

Rishi Sunak Cars : రిషి సునాక్ గ్యారేజిలో ఖరీదైన కార్లు .. శక్తివంతమైన పేలుడును కూడా తట్టుకోగల స్ట్రాంగెస్ట్ కారు

ప్రపంచంలో బలమైన, సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థగా పెత్తనం చెలాయించే హక్కును.. యూకే కోసం తిరిగి సంపాదించాలనే పట్టుదలతో ఉన్నారు రిషి సునక్. అంతేకాదు.. భారత్‌లో 90 కోట్ల మంది 35 ఏళ్ల లోపు వారున్నారని.. వాళ్లంతా తెలివైన వారని కూడా చెప్పారు. వాళ్లందరినీ.. బ్రిటన్ ఆకర్షించాలని సూచించారు. రెండు దేశాల మధ్య బంధం పరస్పర సహకారంతో సాగాలని కోరుకుంటున్నట్లు.. తన క్యాంపెయిన్‌లోనే తెలిపారు.

రిషి సునక్ హయాంలో భారత్-బ్రిటన్ సంబంధాలు బలపడతాయని.. భారతీయులంతా నమ్ముతున్నారు. అయితే.. అది రిషి సునక్‌ భారతీయ మూలాల వల్ల మాత్రమే కాదు. అందుకు.. వేరే రెండు కారణాలున్నాయ్. అందులో.. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఒకటి. రెండోది.. చైనా వ్యతిరేకత అని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. రిషి ప్రచారంలో వినిపించిన చైనా వ్యతిరేకతను బట్టి చూస్తే.. డ్రాగన్‌ని బ్రిటన్ ముప్పుగానే చూస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇంకొందరు మాత్రం.. రిషి సునక్ అజెండాలో భారత్ అగ్రస్థానంలో ఉండదని భావిస్తున్నారు. ఎందుకంటే.. బ్రిటన్‌లోనే అంతర్గతంగా పరిష్కరించాల్సిన ఆర్థిక సవాళ్లు చాలా ఉన్నాయ్. యూరోపియన్ యూనియన్‌, అమెరికాతో సుస్థిరత పునరుద్ధరించాల్సి ఉంది. కాబట్టి.. భారత్ రిషికి తొలి ప్రాధాన్యత కాదంటున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ఏదేమైనా.. ఇండియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంలో మాత్రం.. బ్రిటన్ కొత్త పీఎం రిషి సునక్ కాస్త సీరియస్‌గానే ఉన్నారు. ఈ ఒప్పందాన్ని ఖరారు చేయాలనే ఆయన కోరుకుంటారు. కానీ.. ఇందుకోసం బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని సమూలంగా మార్చడానికి ఇష్టపడరనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బ్రిటన్ ప్రయోజనాలకే.. రిషి తొలి ప్రాధాన్యం ఇస్తారని చెబుతున్నారు.