horse milk : గుర్రం పాలకు డిమాండ్.. లీటర్ ఎంతంటే..!!

ఆవు పాలు, గేదె పాలు, మేకపాలు ఇవన్నీ మనకు తెలిసినవే. మనం ప్రతీరోజు గేదె లేక ఆవుపాలను వాడుతుంటాం. గేదె పాలకంటే ఆవు పాలు ఎంతో శ్రేష్టమని చెబుతుంటారు. అలాగే ఒంటె పాలకు డిమాండ్ పెరిగిందనే వార్తలు విన్నాం.కానీ గుర్రం పాలకు కూడా డిమాండ్ వచ్చేసిందండోయ్..

horse milk : గుర్రం పాలకు డిమాండ్.. లీటర్ ఎంతంటే..!!

Horse Milk Full Demand

horse milk vitamin packed drink grows popularity in uk : ఆవు పాలు, గేదె పాలు, మేకపాలు ఇవన్నీ మనకు తెలిసినవే. మనం ప్రతీరోజు గేదె లేక ఆవుపాలను వాడుతుంటాం. గేదె పాలకంటే ఆవు పాలు ఎంతో శ్రేష్టమని చెబుతుంటారు. అలాగే ఒంటె పాలకు డిమాండ్ పెరిగిందనే వార్తలు విన్నాం.కానీ గుర్రం పాలకు కూడా డిమాండ్ వచ్చేసిందండోయ్..గుర్రం పాలా? అని షాక్ అవుతున్నారా? గుర్రం పాలకు మాంచి డిమాండ్ వచ్చేసింది. అది మన భారత్ లో మాత్రం కాదు ది గ్రేట్ బ్రిటన్ లో..యూకే ప్రజలంతా గుర్రం పాలు తాగటానికి ఇష్టపడుతున్నారట..కాఱమేంటంటే..గుర్రం పాలలో మిటమిన్ల శాతం ఎక్కువగా ఉందట..పైగా గుర్రం పాలు తాగినా మనం రోజు వారీలో ఏదో రకంగా గుర్రం పాలు తీసుకుంటే పలు రకాల వ్యాధులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు యూకే వాసులు.దీంతో బ్రిటన్ లో గుర్రం పాలకు యమా డిమాండ్ ఏర్పడింది.

 

4

యూకేలో ఫ్రాంక్ షోలాయ్ అనే వ్యక్తి గుర్రం పాలను విక్రయిస్తున్నాడు. తాము విక్రయిస్తున్న ఈ పాలలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని, టీ, కాఫీ, స్వీట్లు తయారీలో కూడా ఈ పాలను వినియోగించవచ్చని, ఈ పాలు ఎంతో ఆరోగ్యకరమని చెబుతున్నాడు. గుర్రం పాలు మంచివి కావనే భావనను తొలగించేందుకు ఫ్రాంక్ షోలాయ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ముఖ్యంగా టీ,కాఫీల వంటివి గుర్రం పాలను వినియోగిస్తే ఉల్లాసంగా ఉంటారని చెబుతున్నాడు. కేవలం గేదె, ఆవు, మేక పాలే కాకుండా గుర్రం పాలు కూడా చాలా మంచి చేస్తాయని వీటిలో విటమిన్లు అధికంగా ఉంటాయని చెబుతున్నాడు ఫ్రాంక్ షోలాయ్.

‘ది సన్’ అనే మీడియాతో ఫ్రాంక్ షోలాయ్ మాట్లాడుతూ.. ఆవు పాలకు మంచి మార్కెటంగ్ ఉన్నందునే జనం ఆ పాలను తాగుతున్నారని..అలాగే ఇటీవలి కాలంలో సోయా, ఓట్స్, బాదం పాలను కూడా తాగుతున్నారనీ..జనమంతా ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలను మాత్రమే తీసుకోవాలనుకుంటున్నారని ఫ్రాంక్ తెలిపాడు. ఆరోగ్యం పట్ల ప్రజల్లో మంచి అవగాహన వచ్చిందని..అన్నాడు.

H

62 ఏళ్ల ఫ్రాంక్ ఫ్యామిలీ ఇప్పుడే కాదు గత 20 ఏళ్లుగా గుర్రం పాలను విక్రయిస్తోంది. యూకేలో ఫ్రాంక్ విక్రయిస్తున్న గుర్రం పాలకు మంచి డిమాండ్ ఉంది. గుర్రం పాల అమ్మకాల కోసం ఫ్రాంక్ పలు రకాల గుర్రాలను సంరక్షిస్తున్నాడు. అలా వాటిని పెంచుతూ..వాటి పాలను అమ్ముతున్నాడు. గుర్రం పాల అమ్మకం ద్వారా ఫ్రాంక్ వ్యాపారం బాగా సాగుతోంది.

10

అలాగే గుర్రాలలో పాల దిగుబడి పెరిగేందుకు కూడా పలు పరిశోధనలు చేస్తున్నాడు. ఫ్రాంక్ 250 మిల్లీలీటర్లు గుర్రం పాలను 6.50 పౌండ్లు(656 రూపాయలు)కు విక్రయిస్తున్నాడు. కాగా గుర్రం పాలు ఎగ్జమా అనే వ్యాధిని తరిమికొడతాయని, ఇమ్యూన్ సిస్టమ్‌ను బలోపేతం చేస్తాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది.

8

గుర్రం పాలల్లో ఉండే ఉపయోగాల గురించి ప్రముఖ పరిశోధకులు ప్రొఫెసర్ కుషుగులోవా మాట్లాడుతూ..గుర్రం పాలల్లో లైసోజైమ్,లాక్టోఫెర్రిన్ ఉన్నాయనీ..ఇవి యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటాయని తెలిపారు. ఇవి వ్యాధి కలిగించే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లతో పోరాడటానికి సహాయపడతాయని..రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయని..తెలిపారు.

7

కాగా మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో జర్మనీలో గుర్రం పాలు వాడినట్లుగా తెలుస్తోంది. యూరప్ ఖండంలోని పలు దేశాల్లో గుర్రం పాలను తాగుతుంటారని..ఫ్రాన్స్, బెల్జియం మరియు హాలండ్లలో డజన్ల కొద్దీ పెద్ద ఎత్తున గుర్రం పాల వ్యాపారాలు జరుగుతున్నాయట.