Hot Air Balloon: గాలిలో ఎగురుతున్న హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు.. కిందికి దూకిన ఇద్దరు మృతి.. షాకింగ్ వీడియో

మెక్సికోలో విషాదం చోటు చేసుకుంది. మెక్సికో సిటీకి సమీపంలోని ప్రఖ్యాత టియోటిహుకాన్ పురావస్తు ప్రదేశంలో హాట్ - ఎయిర్ బెలూన్‌లో గాలిలోకి ఎగిరిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, ఓ బాలుడికి గాయాలయ్యాయి. బెలూన్ గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికి మంటలు వ్యాపించాయి. అందులోని ప్రయాణికులు కిందికి దూకారు. వారిలో ఇద్దరు మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Hot Air Balloon: గాలిలో ఎగురుతున్న హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు.. కిందికి దూకిన ఇద్దరు మృతి.. షాకింగ్ వీడియో

Hot Air Balloon

Hot Air Balloon: మెక్సికోలో విషాదం చోటు చేసుకుంది. మెక్సికో సిటీకి సమీపంలోని ప్రఖ్యాత టియోటిహుకాన్ పురావస్తు ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. టియోటిహుకాన్ ప్రాంతానికి వచ్చే సందర్శకులు ఎక్కువ మంది అక్కడ హాట్ – ఎయిర్ బెలూన్స్‌లో విహంగ వీక్షణం చేస్తుంటారు. ఈ క్రమంలో పలువురు సందర్శకులు శనివారం హాట్ – ఎయిర్ బెలూన్స్‌లో ఎక్కి విహంగ వీక్షణం చేస్తున్నారు. కొంతదూరం పైకివెళ్లిన తరువాత బెలూన్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. భయంతో అందులోని ప్రయాణికులు కిందకు దూకగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయాలైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Mexico Mafia Don Arrested: డ్రగ్స్ మాఫియా డాన్ అరెస్ట్.. మెక్సికో సిటీలో విధ్వంసం.. 29మంది మృతి

ఈ ఘటనకు సంబంధించి మెక్సికో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు బెలూన్ నుండి దూకడంతో ఇద్దరు మరణించారని ఆ ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. మరణించిన వారిని 39ఏళ్ల మహిళ, 50ఏళ్ల వృద్ధులుగా గుర్తించారు. గాయపడిన వారిలో ఓ మైనర్ బాలుడికి ముఖానికి కాలిన గాయం కాగా, కిందకు దూకడంతో కుడి తొడకు ఎముక ఫ్రాక్చర్ అయిందని తెలిపారు. అయితే, బెలూన్ లో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు అనే విషయాలు వెల్లడించలేదు.

 

 

మెక్సికోలోని టియోటిహుకాన్ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది కొలంబియన్ పూర్వకాలం నాటి స్మారక చిహ్నం. అనేక మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. టూర్ ఆపరేటర్లు మెక్సికో నగరానికి ఈశాన్యంగా 45మైళ్ల దూరంలో ఉన్న టియోటిహుకాన్ మీదుగా దాదాపు 150 డాలర్లకు హాట్ ఎయిర్ బెలూన్‌ను అందిస్తారు. ఇందులో ప్రయాణీకులు గాలిలో ప్రయాణిస్తుంటారు. అయితే, శనివారం హాట్ ఏయిర్ బెలూన్‌లో ప్రయాణీకులు గాలిలో ప్రయాణిస్తున్నక్రమంలో మంటలు వ్యాపించాయి. దీంతో బెలూన్ నుంచి ప్రయాణికులు కిందికి దూకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.