ఈ టాబ్లెట్ ఉంటే చాలు.. నొప్పులే కాదు.. మరకలు మాయం

  • Published By: veegamteam ,Published On : February 25, 2019 / 10:08 AM IST
ఈ టాబ్లెట్ ఉంటే చాలు.. నొప్పులే కాదు.. మరకలు మాయం

జ్వరం వచ్చినా.. ఒళ్లు నొప్పులు వచ్చినా మరేదైనా నొప్పులు వచ్చినా మనకు చటుక్కున గుర్తుకొచ్చే టాబ్లెట్ పారాసెటమాల్. మనకే కాదు డాక్టర్ దగ్గరకెళ్లినా అదే రాస్తాడు. మరి ఈ టాబ్లెట్ వీటికి మాత్రమే ఉపయోగపడుతుందా అంటే కాదు.. పారాసెటమాల్ టాబ్లెట్ మరకల్ని కూడా మాయం చేస్తుంది. ఏంటీ అదేమన్నా వాషింగ్ పౌడరా మరకల్ని మాయం చేయటానికి అనుకుంటున్నారా? కాదండీ బాబు నిజం. 
Read Also: అక్కడ ఏం జరిగింది : శ్రీధరణిని చంపింది ప్రియుడేనా!

పారాసెటమాల్ మురికిని (మరకల్ని) కూడా వదిలిస్తుందా? అదేలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే..మీరు ఇది తెలుసుకోవాల్సిందే. పశ్చిమ ఇంగ్లాండ్‌‌లోని సోమెర్సెట్‌లో నివసిస్తున్న రెబెక్కా హర్రీస్ అనే మహిళ.. ఇస్త్రీ పెట్టె(ఐరన్ బాక్స్)కు అట్టలా పేరుకుపోయే మురికిని తొలగించేందుకు ఓ చిట్కాని ఆలోచించింది. అదే పారాసెటమాట్ టాబ్లెట్ తో. 

పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకుని వేడి ఉన్న ఐరన్ బాక్స్‌పై పెట్టింది. ఆ తర్వాత ఓ పిన్ సాయంతో దాన్ని ఇస్త్రీ పెట్టె అడుగున నల్లగా, అట్టలా పేరుకుపోయిన మురికిపై పెట్టి రుద్దింది. ఆ తర్వాత దాన్ని ఓ పేపర్ తో తుడిచింది. అంతే, మురికి..మాయం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
Read Also: కొత్త చట్టం ఎఫెక్ట్ : మళ్లీ నోట్ల కష్టాలు రాబోతున్నాయా.. ATMలు ఖాళీనా!