‘మహమ్మారి’..కరోనా మృతులు ఏదేశంలో ఎంతమందంటే..!!

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 09:55 AM IST
‘మహమ్మారి’..కరోనా మృతులు ఏదేశంలో ఎంతమందంటే..!!

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను క్రమక్రమంగా కమ్మేస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచం అబ్బా అంటోంది. దాన్ని నియంత్రించటానికి ఆయా దేశాలు హెల్త్ ఎమర్జన్సీన ప్రకటిస్తున్నాయి అంటే కరోనా తీవ్రత ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఈ క్రమంలో కరోనా బారిని పడి మరణిస్తున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. 
ఇప్పటి వరకూ 145 దేశాలకు పాకిన ఈ మహమ్మారి వందల కోట్ల మందిని వణికించేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1 లక్షా 45వేల 700ల మందికి కరోనా సోకగా వారిలో 5వేల 438 మంది ఈ కరోనా కాటుకు బలైపోయారు. 

చైనాలో 3వేల 189 మంది మృతి చెందారు
ఇటలీ – 1266
ఇరాన్ – 514
స్పెయిన్ – 133
దక్షిణ కొరియా -72
అమెరికా – 50 
భారత్ – 83 కరోనా కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు 

ఇలా ప్రపంచంలోని దేశాలను వణికించేస్తూ..ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా దెబ్బకొడుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు బాధిత దేశాలు యుద్ధం చేస్తుంటే..ఈ వైరస్ సోకని దేశాలు మాత్రం ఈ రాక్షస వైరస్ తమ దేశానికి సోకుండా ఉండాలని ప్రార్థిస్తున్నారు.దాని కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికా హెల్త్ ఎమర్జీన్సీని ప్రకటించింది.

ఈ క్రమంలో కరోనా తూర్పు ఆఫ్రికాకు వ్యాపించింది.కెన్యా, ఇథియోపియాల్లో తొలి కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో పుట్టిన ఈ మహమ్మారిని చైనా తీవ్రంగా శ్రమించి కట్టడి చేస్తోంది. దాని ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే అంతభారీ జనాభా కలిగిన చైనాలో 3వేల 189మాత్రమే కరోనా బాధితులు చనిపోయారు. అంటే ఆ దేశం ఎంతగా దీనిపై ఎంతగా యుద్ధం చేసి కట్టడి చేస్తోంది అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో చైనాలో మరో 20 కొత్త కేసులు నమోదయ్యాయి. 

యూరప్ దేశాల్లో కరోనా విస్తృతి తీవ్రస్థాయిలో ఉంది. ఇటలీలో 17వేల మందికి పైగా కేసులు నమోదవగా 12వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.  రోజురోజుకు వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. కొత్తగా రెండున్నర వేలమంది వైరస్ బారినపడ్డారు. 

అగ్రరాజ్యం అమెరికాను కూడా కరోనా వణికిస్తోంది. ఇప్పటి వరకూ అమెరికాలో కొత్తగా 590 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో 50 మంది చనిపోయారు. ఇరాన్ లో 1300లమందికి కరోనా సోకగా 514మంది చనిపోయారు. స్పెయిన్ లో 5వేలకు పైగా కేసులు నమోదు కాగా  133మంది కరోనాకాటుకు బలైపోయారు. జర్మనీలో 930, ఫ్రాన్స్ 785, స్విట్జర్లాండ్ లో 271,యూకేలో 208 కొత్తకేసులు నమోదు కావటంతో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది.  

Also Read | రక్త మరిగిన రహదారులు..20మంది బలి!!