అమెరికాకు 46వ ప్రెసిడెంట్‌గా బైడెన్ జీతమెంతో తెలుసా..

అమెరికాకు 46వ ప్రెసిడెంట్‌గా బైడెన్ జీతమెంతో తెలుసా..

Salary of Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు ప్రత్యర్థిగా జో బైడెన్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఫలితాలు వచ్చిన తర్వాత అధికారికంగా జనవరి 20వ తేదీ బుధవారం ప్రెసిడెంట్ పదవికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో అమెరికాకు ఒబామా అడ్మినిస్ట్రేషన్ లో 2009నుంచి 2017వరకూ 47వ వైస్ ప్రెసిడెంట్ గా బాద్యతలు అందించిన బైడెన్ అగ్రరాజ్యానికి 46వ ప్రెసిడెంట్ అని చెప్పడానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆఫీస్ కు లీడ్ గా వ్యవహరించనున్న బైడెన్ జీతమెంతో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది కదా.. 1942 నవంబర్ 20న పుట్టిన బైడెన్ సంవత్సర ఆదాయం 9మిలియన్ డాలర్లు. 4మిలియన్ డాలర్ల విలువ చేసే ఇళ్లు ఉన్న బైడెన్‌కు అతని భార్య ఇన్వెస్ట్‌మెంట్ ల నుంచి 4మిలియన్ డాలర్లు వస్తుండగా, ఫెడరల్ పెన్షన్ కింద మిలియన్ డాలర్ వస్తుంది.

జో బైడెన్ శాలరీ:
బైడెన్ కేవలం 29ఏళ్ల వయస్సులోనే అంటే 1972లో సెనేటర్ అయిపోయారు. చరిత్రలోనే అత్యంత చిన్న వయస్సు సెనేటర్ ఈయనే. 1973 నుంచి 2009వరకూ డెలవరెను రిప్రజెంట్ చేస్తూ బాధ్యతలు నిర్వర్తించారు. 1979లో అతని స్టార్టింగ్ శాలరీ సంవత్సరాలనిక 42వేల 500 డాలర్లు.

2009లో సెనేటర్ నుంచి తప్పుకునేటప్పుడు అతని వార్షిక వేతనం లక్షా 69వేల 300డాలర్లు. వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు 2లక్షల 30వేల 700డాలర్లు అందుకునేవారు. మీడియా రిపోర్టుల ప్రకారం.. 2008 ఆగష్టులో బైడెన్ రాయల్టీస్ లో 71వేల డాలర్లు, ఆడియో బుక్ రైట్స్ కింద 9వేల 500డాలర్లు సంపాదించాడు. అదే ప్రెసిడెంట్ గా సంవత్సరానికి 4లక్షల డాలర్లు అందుకోనున్నారు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే.. 2కోట్ల 92లక్షల 45వేల 240రూపాయలు మాత్రమే.

బైడెన్ కుటుంబం:
బైడెన్ మొదటి భార్య నీలియా, కూతురు నావోమీ క్రిష్టమస్ షాపింగ్ కు వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ జరిగి చనిపోయారు. ఆ తర్వాత కొద్ది వారాలకే జరిగిన 1972ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. డెలావరె నుంచి వాషింగ్టన్ కు ట్రైన్ నడపాలని బైడెన్ తీసుకున్న నిర్ణయం ప్రభావవంతంగా పనిచేసింది. అతని జీవితంలో 36ఏళ్ల పాటు సెనేట్ గా వ్యవహరించారు. బైడెన్‌కు జిల్‌తో 1977లో వివాహమైంది.