కరోనాను జయించాక..ప్రజలు ఎలా బతకాలో నేర్పుతున్న న్యూజిలాండ్

  • Published By: nagamani ,Published On : May 25, 2020 / 10:36 AM IST
కరోనాను జయించాక..ప్రజలు ఎలా బతకాలో నేర్పుతున్న న్యూజిలాండ్

ప్రపంచానికి పెను ముప్పుగా దాపురించిన మాయదారి మహమ్మారి కరోనాని కట్టడి చేసిన అతి కొద్ది దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. కరోనాని జయించిన దేశంగా ప్రకటించుకున్నదేశం కూడా న్యూజిలాండే. ఇప్పుడు న్యూజిలాండే ప్రపంచానికి కరోనా తర్వాత ఎలా బతకాలో నేర్పబోతోందా అంటే..కొన్ని నిదర్శనాలు అందుకు కన్పిస్తున్నాయ్ 

కరోనా వైరస్ విశ్వరూపంతో లాక్‌డౌన్ విధించడమే తప్ప..తిరిగి ఎలా సాధారణ జీవనం సాగించాలో తెలీని స్థితి..అసలు ఇదివరకు ఎలా బతికారో తర్వాత సంగతి ఆంక్షలు సడలించినా కాలు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితుల్లో వ్యాపారాలు ఎలా నడపాలో తెలీని పరిస్థితుల్లోయజమానులున్నారు. ఇటువంటి సమస్యలకు న్యూజిలాండ్..ఓ దిక్చూచిగా కన్పిస్తోంది..లాక్‌డౌన్ తర్వాత ఎలా వ్యవహరించాలి? ప్రజల్లో ఎటువంటి చైతన్యంరావాలి? అనేవిషయంలో కూలకషంగా పరిశీలించి చర్యలు తీసుకుంటోంది.  అటు ప్రజలు సురక్షితంగా ఉండాలి. మరోవైపు ఆర్థికరంగం గాడిలో పడాలి. అనే అంశాలపైపై న్యూజిలాంట్ ప్రపంచ దేశాలకు పాఠాలు చెబుతోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ..ఆఖరికి పెద్దన్నగా చెప్పుకునే దేశం కూడా చిన్న దేశమైన న్యూజిలాండ్ పాఠాలు వంట పట్టించుకోవాల్సిందే.  

దేశంలో టూరిజాన్ని మళ్లీ డెవలప్ చేసేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం ఓ చక్కటి ఐడియా వేసింది..వారంలో వర్కింగ్ డేస్‌ నాలుగే. మిగిలిన రోజులు హాలిడేస్‌గా ప్రకటించబోతోంది..దీంతో ప్రజలు తమకి దొరికిన సెలవులను టూరిస్ట్ స్పాట్స్‌కి వెళ్లడంలో గడుపుతారని అంచనా వేస్తోంది..దీంతో అన్ని ప్రాంతాలు ఆర్థికంగా బలపడేలా యోచిస్తోంది.

 అంతేకాదు దేశీయంగా అభివృద్ధి చెందుతుందనేది ఇందులో వ్యూహం..రోటోరువాలోని నార్త్ ఐలండ్ సిటీలోని టూరిస్ట్ ఆపరేటర్లతో ప్రభుత్వం చర్చించిన తర్వాత ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. దీనికిసంబంధించి నిర్ణయాలు తీసుకోవటానికి సిద్ధపడుతోంది. అదే కనుక జరిగితే ప్రభుత్వ అంచనాల ప్రకారంగా ప్రజలు కూడా ప్రభుత్వానికి అనుగుణంగా స్పందించటానికి రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 

చూసారా..తధా రాజా తథా ప్రజ అన్నట్లుగా పాలకులు ప్రజలపై దృష్టి పెడతే..వారి బాగోగుల గురించి ఆలోచిస్తే ప్రజలు కూడా పాలకులకు..వారి నిర్ణయాలను గౌరవిస్తారు..అమలు చేస్తారు. అంతేకానీ..దేశానికి ఏదో కష్టం వచ్చిందనీ..అదేనండీ ప్రస్తుతం ప్రపంచానికి వచ్చిన కష్టం కరోనా కష్టం. దాన్నించి ఆర్థికంగా కూడదీసుకోవాలంటే ఆ పన్నులు..ఈ పన్నులు..ఈ చార్జీలు..ఈ చార్జీలు..వాహనాలపై అర్థం పర్థం లేని చలానాలు వేసేసి..ప్రజల్ని మరింత కష్టంలోకి నెట్టేసే పాలకులు ఉంటే అటువంటి ప్రభుత్వాలకు ప్రజలు సహకరించరనే విషయం ఆయా దేశాలు తెలుసుకోవాలి. 

అటువంటి ప్రభుత్వాలు న్యూజిలాండ్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని అటు దేశానికి..ఇటు ప్రజలకు మేలు చేసే నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా కష్టం నుంచి బైటపడి..ప్రజలను చైతన్యపరిచేలా నిర్ణయాలను తీసుకుంటున్నా న్యూజిలాండ్ ప్రభుత్వం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ప్రతీ దేశానికి ఉంది.

Read: కరోనాను జయించిన 107 ఏళ్ల వృద్ధురాలు