లెక్కపెట్టుకుని మరీ 20డాలర్లు విరాళమిచ్చిన ట్రంప్.. వైరల్ వీడియో

10TV Telugu News

Donald Trump:అమెరికా ప్రెసిడెంట్ Donald Trump‌ డొనేట్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. డబ్బులు లెక్కపెడుతూ ఉన్న ఫొటో, వీడియోలకు కామెంట్‌ల రూపంలో జోకులు పేలుస్తున్నారు. నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష పదవి ఎన్నికల నేపథ్యంలో ట్రంప్.. ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గెలుపోటములను నిర్ణయించే రాష్ట్రాలపై ఫోకస్ పెట్టి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.

శనివారం నెవాడా రాష్ట్రం చేరుకున్న ట్రంప్.. ప్రచార ర్యాలీలో పాల్గొనడానికి ముందు.. లాస్ వేగాస్‌లోని అంతర్జాతీయ చర్చిని సందర్శించి ప్రార్థనలు చేసుకున్నారు. కొద్ది సమయం అక్కడే గడిపారు. ఆ సమయంలో ఓ వ్యక్తి డొనేషన్ కోసం బకెట్‌ను చేతిలో పట్టుకుని అక్కడికి వచ్చిన వారిని విరాళాలు అడుగుతున్నాడని గుర్తించిన ట్రంప్.. ముందుగానే పాకెట్లు సర్దుకున్నారు.
https://10tv.in/trump-threatens-to-leave-the-country-if-he-loses-to-biden/
కొన్ని డాలర్లను తీసి కాళ్ల మధ్యలో పెట్టుకుని శ్రద్ధగా లెక్కపెట్టారు. కావలసినంత తీసుకుని మళ్లీ సర్దుకున్నారు. ఇంతలో ట్రంప్ వద్దకు విరాళాలు సేకరించే వ్యక్తి చేరుకుని.. డొనేషన్ అడిగాడు. ట్రంప్ ముందే చేతిలో పట్టుకుని ఉన్న డబ్బును డొనేషన్ బకేట్‌లో వేశారు. ఈ దృశ్యాలను అక్కడున్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

వీడియో‌పై స్పందిస్తూ పలు రకాల రియాక్షన్లు ఇస్తున్నారు నెటిజన్లు. ‘ట్రంప్‌కు విరాళం ఇవ్వడం ఇష్టం లేదేమో’, ‘అంతపెద్ద బిలియనీర్ 20డాలర్లు మాత్రమే ఇస్తున్నాడా’,మరికొందరేమో ‘ఆస్తిపన్ను చెల్లించే సమయంలో ఇచ్చిన విరాళాల గురించి అడ్జస్ట్ చేయాలి కదా.. అందుకే లెక్కిస్తున్నారు కాబోలు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

10TV Telugu News