మన ఎస్‌పీజీ యూఎస్ సీక్రెట్ సర్వీస్‌తో పోటీ పడగలదా?

మన ఎస్‌పీజీ యూఎస్ సీక్రెట్ సర్వీస్‌తో పోటీ పడగలదా?

భారత్‌లో SPGను కుదించి ప్రధానికి మాత్రమే పరిమితం చేశారు. ఈ భద్రత విభాగం భారత్‌తో పాటు అమెరికాలోనూ ఉంది. ఈ రెండు దళాల మధ్య వ్యత్యాసాలు, పోలికల గురించి విశ్లేషిస్తే.. 

కొద్ది నెలలుగా భారత్‌లో SPG స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపుపై చర్చ నడుస్తోంది. సోమవారం దీనిపై లోక్ సభలోనూ బిల్లు ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రితో పాటు, మాజీ ప్రధానికి ఐదేళ్ల పాటు మాత్రమే ఈ సర్వీసు అందించాలని దాని ముఖ్య ఉద్దేశ్యం. అమెరికాలోని యూఎస్ సీక్రెట్ సర్వీసెస్‌కు మధ్య పోలికలు ఉన్నా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. 

How SPG differs form USSS

1985లో ఎస్పీజీ ప్రతిపాదన వచ్చినా మూడేళ్ల తర్వాత ఆమోదం పొంది ప్రధానమంత్రికి, అతని కుటుంబ సభ్యులకు వెంటనే భద్రత కలిగింది. అమెరికాలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లతో పాటు వారి కుటుంబాలకు పదవిలో ఉన్నంత కాలం, ఇతర ఉన్నతాధికారులు విదేశాలకు పర్యటించినప్పుడు ఈ యూఎస్ఎస్ఎస్ వర్తిస్తుంది. 

1994లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా అమెరికాలో పర్యటించినప్పుడు ఎస్పీజీని పక్కకుబెట్టి యూఎస్ఎస్ఎస్ ను వాడుకున్నారు. ఆ తర్వాత 2004లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా న్యూయార్క్ లో జరిగిన యూఎన్‌జీఏ సదస్సులోనూ ఇదే జరిగింది. 

How SPG differs form USSS

రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఐదేళ్ల పాటు ఉన్న ఈ ఎస్పీజీని పదేళ్లకు పెంచారు.  ప్రధానిగా ఉన్నంత కాలం, మాజీగా ఉన్న ఐదేళ్ల కాలం ఈ భద్రత దక్కుతుంది. 2003లో దీనిలో సంవత్సరం తగ్గించారు. 

యూఎస్ఎస్ఎస్‌ మాజీ ప్రెసిడెంట్లకు, వారి భార్యలకు జీవితకాలం ఉంటుంది. వారి పిల్లలు మైనర్లు అయితే 16ఏళ్లు వచ్చే వరకూ ఇదే హోదాలో కొనసాగుతారు. ఈ ఎస్పీజీలో పనిచేసే వ్యక్తుల పదవీకాలం కేవలం 6ఏళ్లే. యూఎస్ఎస్ఎస్‌లో 6 నుంచి 8ఏళ్ల వరకూ ఉంటుంది. 
 
యూఎస్ఎస్ఎస్‌లో పని చేసే ఉద్యోగులకు జాబ్‌ను విడిచిపెట్టేందుకు స్వేచ్ఛ ఉంటుంది. ఎస్పీజీలో స్వతహాగా నిర్ణయాలు తీసుకునే వీలు లేదు. ఏదైనా అధికారుల ఇష్టం మేరనే జరుగుతుంది.