Sri Lanka : నేను ఇక్కడనే ఉంటా..ఇంటి గడప వద్ద మొసలి, ఒళ్లు జలదరించే వీడియో

ఓ భారీ మొసలి ఓ ఇంటి గడప వద్దే..కూర్చొంది. రెస్క్యూ టీం వచ్చిన తర్వాత..కూడా అది అక్కడనే ఉండిపోయింది. దీంతో దానిని పట్టుకోవడానికి రెస్క్యూ టీం చాలా కష్టపడింది. చూస్తేనే భయకరంగా ఉన్న ఈ మొసలికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది.

Sri Lanka : నేను ఇక్కడనే ఉంటా..ఇంటి గడప వద్ద మొసలి, ఒళ్లు జలదరించే వీడియో

Srilanka

Huge Crocodile : నేను ఇక్కడనే ఉంటా..అన్నట్లు..ఓ భారీ మొసలి ఓ ఇంటి గడప వద్దే..కూర్చొంది. రెస్క్యూ టీం వచ్చిన తర్వాత..కూడా అది అక్కడనే ఉండిపోయింది. దీంతో దానిని పట్టుకోవడానికి రెస్క్యూ టీం చాలా కష్టపడింది. చూస్తేనే భయకరంగా ఉన్న ఈ మొసలికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది.

శ్రీలంకలోని Anuradhapura ప్రాంతంలోని Habaranagama వద్ద ఓ ఇంటి గడప వద్ద భారీ మొసలి ప్రత్యక్షమైంది. ఇంటి తలుపులు తెరిచి చూసిన ఆ కుటుంబం షాక్ కు గురైంది. భయంతో వణికిపోయారు. సుమారు 8 అడుగుల వరకు ఉంది. వెంటనే ఈ విషయాన్ని వన్యప్రాణుల సంరక్షణ అధికారులకు (wildlife conservation officers) సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆ అధికారులు ఇంటి వద్దకు చేరుకున్నారు. దీనిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. అయితే..ఆ మొసలి అధికారులపై దాడి చేసేందుకు ప్రయత్నించింది.

దాని అరుపులతో భయంతో వణికిపోయారు. దాని మూతిపైకి ఓ బ్యాగును విసిరేశారు. అనంతరం కర్రతో మెల్లిగా కొట్టే వరకు …దాడి చేసేందుకు యత్నించింది. చివరకు ..దానిని కష్టపడి పట్టుకున్నారు. అనంతరం దానిని బంధించి..ట్రక్కుల్లో ఎక్కించారు. దీంతో హమ్మయ్య..అంటూ ఆ కుటుంబం ఊపిరిపీల్చుకుంది. Makichchiawa చెరువులో నీళ్లు ఎండిపోయే సరికి..నివాస ప్రాంతంలోకి వచ్చి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.