భారీ పేలుళ్లు..73 మంది మృతి..2, 750 మందికి గాయాలు

  • Published By: madhu ,Published On : August 5, 2020 / 06:21 AM IST
భారీ పేలుళ్లు..73 మంది మృతి..2, 750 మందికి గాయాలు

లెబనాన్ రాజధాని బీరుట్ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లకు 73 మంది చనిపోగా..2 వేల 750 మందికి గాయాలయ్యాయి. పేలుళ్ల ధాటికి భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. అనేక మంది శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం. దీంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడు అనంతరం మంటలు వ్యాపించాయి.



దీనికారణంగా..ప్రమాద తీవ్రత మరంత పెరిగింది.
ఎక్కడ చూసినా..శిథిలాలు..దెబ్బతిన్న వాహనాలు కనిపిస్తున్నాయి. ప్రజల హాహాకారాలతో ఆయా ప్రాంతాలు దద్ధరిల్లాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించనట్లు సమాచారం.

అయితే..ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై క్లారిటీ రావడం లేదు. బీరుట్ ఓడరేవుళ్లో టపాసులు నిల్వ చేసిన గిడ్డంగిలో పేలుడు సంభవించినట్లు అక్కడి మీడియా వెల్లడిస్తోంది. సమాచారం తెలుసుకున్న అధికారులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. డజన్ల కొద్ది అంబులెన్స్ లు ఘటనా ప్రదేశానికి చేరుకున్నాయి.



క్షతగాత్రులను ఆసుపత్రుకు తరలిస్తున్నారు. చాలా మందికి తీవ్రగాయాలు కావడంతో…రక్తం కొరత ఏర్పడిందని సమాచారం. దీంతో దాతలు రక్తదానం చేయాల్సిందిగా కోరుతున్నారు.