Human Meat In Street Food : మహిళకు చేదు అనుభవం.. ఆహారంలో మానవ పురుషాంగం

ఘనా దేశంలో రోడ్ సైడ్ ఫుడ్ తీసుకెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైనది. రోడ్ సైడ్ ఫుడ్ కోర్టులో తువో జాఫీ అనే ఆహారం పార్సిల్ తీసుకుంది ఓ మహిళ ఫుడ్‌లో మానవ పురుషాంగం ముక్క కనిపించింది.

Human Meat In Street Food : మహిళకు చేదు అనుభవం.. ఆహారంలో మానవ పురుషాంగం

Human Meat In Street Food

Human Meat In Street Food : ఘనా దేశంలో రోడ్ సైడ్ ఫుడ్ తీసుకెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైనది. రోడ్ సైడ్ ఫుడ్ కోర్టులో తువో జాఫీ అనే ఆహారం పార్సిల్ తీసుకుంది ఓ మహిళ.. ఇంటికి వెళ్లి ఓపెన్ చేసి చూడగా ఆ ఫుడ్‌లో మానవ పురుషాంగం మాదిరి ఓ మాంసం ముక్క కనిపించింది. దీంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. దీనిని చూసిన నెటిజన్లు ఫుడ్ కోర్టు నిర్వాహకుడిపై మండిపడుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ ఫోర్టు నిర్వాహకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ సదరు మహిళకు సలహా ఇస్తున్నారు నెటిజన్లు.

చదవండి : Leftover Food To The Needy : పెళ్లిలో మిగిలిపోయిన ఫుడ్‌‍ని పేదలకు పంచిన మహిళ

అయితే ఈ దేశంలో ఇలా జరగడం ఇది తొలిసారేం కాదు. 2016లో ఓ సారి ఓ వ్యక్తి కొనుగోలు చేసిన ఆహారం ప్యాకెట్లో పురుషాంగం బయటపడింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి ఫుడ్ కోర్టు సీజ్ చేశారు. మరోసారి ఇటువంటి ఘటనే చోటుచేసుకోవడంతో దేశంలో కలకలం రేపుతోంది. ఇలా అనుమతులు లేకుండా ఆహారం తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దని నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

చదవండి : Nutrients Food : వయస్సు అర్ధ సెంచరీ దాటిందా?…మీరు తినాల్సిన పోషకాహారాలు ఇవే!

 

View this post on Instagram

 

A post shared by Ghbase.com (@officialghbase)