Human Satan: హ్యూమన్ సైతాన్.. దెయ్యాలుగా మారేందుకు శస్త్రచికిత్సలు!

బాడీ మాడిఫికేషన్ అంటే తెలుసా.. అదేదో బైకు, కారులో మార్పులు చేసి రేస్ కారుగా మార్చినట్లు.. బస్సు కొని దాన్ని కార్ వ్యాన్ గా మార్చుకున్నట్లు బాడీకి ఆపరేషన్లు చేయించుకొని వాళ్ళకి కావాల్సినట్లు మార్చుకోవడమే ఈ బాడీ మాడిఫికేషన్. ముక్కు, మూతి వంకరకు మన స్టార్స్, సెలబ్రిటీలు కాస్మొటిక్ సర్జరీలు చేయించుకోవడం మనం విన్నాం.. చూశాం.

Human Satan: హ్యూమన్ సైతాన్.. దెయ్యాలుగా మారేందుకు శస్త్రచికిత్సలు!

Human Satan

Human Satan: బాడీ మాడిఫికేషన్ అంటే తెలుసా.. అదేదో బైకు, కారులో మార్పులు చేసి రేస్ కారుగా మార్చినట్లు.. బస్సు కొని దాన్ని కార్ వ్యాన్ గా మార్చుకున్నట్లు బాడీకి ఆపరేషన్లు చేయించుకొని వాళ్ళకి కావాల్సినట్లు మార్చుకోవడమే ఈ బాడీ మాడిఫికేషన్. ముక్కు, మూతి వంకరకు మన స్టార్స్, సెలబ్రిటీలు కాస్మొటిక్ సర్జరీలు చేయించుకోవడం మనం విన్నాం.. చూశాం. కానీ దెయ్యాలు, భూతాలుగా కనిపించాలని.. మానవ సైతాన్ లుగా మారిపోవాలని కూడా ఆపరేషన్లు వచ్చేశాయి. మన దేశంలో ఈ వికృత సంస్కృతి పెద్దగా తెలియదు కానీ.. ఇతరదేశాల్లో ఈ బాడీ మాడిఫికేషన్ కు చాలా క్రేజ్ ఉంది.

అలా క్రేజ్ కోసం ఓ వ్యక్తి మానవ సైతాన్ గా కనిపించాలని ఏకంగా ముప్పైకి పైగా శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. ఇప్పటికే నెత్తి మీద కొమ్ములు కూడా ఆపరేషన్ ద్వారా అంటించుకున్న అతగాడు నాలుకను మధ్యలోకి చీల్చుకొని రెండు నాలుకలు చేసుకుని.. పెదవుల చివర రెండు కోరలు కూడా నాటించుకున్నాడు. ఇప్పటికే అతను దెయ్యానికి.. భూతానికి క్రాసింగ్ లాగా కనిపిస్తే అది కూడా చాలదని ఇప్పుడు ఏకంగా ముక్కు చివర తొలగించుకునే శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

ఇతగాడి పైత్యానికి అతని భార్యే పునాది. ఎందుకంటే ఆమెనే బాడీ మాడిఫికేషన్ లో పెద్ద తోపు. బయట వాళ్లందరికీ ఇలాంటి సైతాన్ సర్జరీలు చేసే ఆమె ఇంట్లో భర్తను ముందుగా అలా తయారుచేసింది. బ్రెజిల్‌కు చెందిన 44 ఏళ్ల మైఖెల్‌ ఫారో డో ప్రదో, అతడి భార్య కరోల్‌ ఈ హ్యూమన్ సైతాన్ అనే వికృతమైన సంస్కృతికి కేరాఫ్ గా మారారు. ముక్కు కొనను తొలగించుకుని అందవికారకంగా మారిన మారిన వారిలో మైఖేల్ మూడో వ్యక్తి కాగా అతనిని చూస్తే నిజంగానే సైతాన్ భూమ్మీదకు వచ్చేశాడని అనిపించడం గ్యారంటీగా కనిపిస్తున్నాడు. ఇంతకీ ఇదెక్కడి పైత్యంరా దేవుడా అని ఇది చూసిన భారతీయులు ముక్కున వేలేసుకుంటున్నారు.