ఢిల్లీ అల్లర్లపై అమెరికా వీధుల్లో నిరసన.. వందల సంఖ్యలో జనం

ఢిల్లీ అల్లర్లపై అమెరికా వీధుల్లో నిరసన.. వందల సంఖ్యలో జనం

సీఏఏ వ్యతిరేకులపై దాడులతో ఢిల్లీలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనలు పదులు సంఖ్యలో మారణహోమం సృష్టిస్తోంది. దీనిపై అగ్రరాజ్యం సైతం తన స్వరాన్ని వినిపించింది. అమెరికా వీధుల్లో వందల మంది నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ చేశారు. శుక్రవారం జరిగిన అల్లర్లలో 42మంది చనిపోగా వంద సంఖ్యలో గాయాలకు గురయ్యారు. 

దేశ రాజధానిలో జరుగుతున్న ఆందోళనల్లో మతాలపేరిట చిచ్చు పెట్టుకుంటూ షాపులకు, మసీదులకు నిప్పెట్టుడుతున్నారు. కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా మతాల మధ్య చిచ్చు రగులుతోంది. బీజేపీ లీడర్ కపిల్ మిశ్రా విద్వేష పూరిత వ్యాఖ్యల కారణంగానే గొడవలు జరుగుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. 

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం కారణంగానే ఆందోళనలు పెరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఎదురుగా నిరసనకారులు కూర్చొని సిగ్గు(Shame) అంటూ నినాదాలు చేశారు. ఇండియన్ అమెరికన్ కౌన్సిల్, సౌతాసియా సొలిడేటరీ ఇనిషియేటివ్, ఈక్విటీ లాబ్స్‌తో కలిసి సౌత్ ఆసియా గ్రూపులు నిరసనలో పాల్గొన్నాయి. 

ఈ సందర్భంగా కుతుబుద్దీన్ అనే వ్యక్తి 1984వ సంవత్సరం ఇందిరా గాంధీ హయాంలో సిక్కులపై జరిగిన దాడిని ప్రస్తావించారు. ‘ఆ సమయంలో ఢిల్లీలోనే ఉన్నాను. నవీన భారత చరిత్రలో ఈ ఉద్యమం నిలిచిపోతుంది. మైనారిటీ వ్యక్తులతో పాటు, హిందూ మత తక్కువ కులస్థులను బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని ఆందోళనలో తెలిపారు. కార్యక్రమంలో దాదాపు 300మంది పాల్గొన్నారు. 

ఇదే సందర్భంగా బీజేపీ ఐడియాలజీపైనా విమర్శలు వచ్చాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) సిద్ధాంతాలనే ఫాలో అవుతుందంటూ ఆరోపణలు గుప్పించారు. ఆందోళనకారులు కొత్తగా నిరసనలో పాల్గొన్నారు. మ్యూజిక్ ప్లే చేస్తూ.. ఇండియన్ కాన్సులేట్ బ్లాక్ మొత్తం తిరిగారు. వారి నిశ్శబ్దమే ఆయుధంగా మారుతుందని నిర్వహకులు అంటున్నారు. 

సెక్యూలర్ ఇండియా అనే ఆలోచనలోనే పెరిగాను. పూర్తిగా భారత సిస్టం చెడిపోతుందని.. ఇదంతా మోడీ ప్రభుత్వంలోనే జరుగుతుందంటూ న్యూయార్క్‌లో 12ఏళ్లుగా ఉంటున్న ఇషిత శ్రీవాస్తవ అన్నారు. ఇదంతా వ్యూహాత్మకంగానే జరుగుతుంది. హింసను ప్రోత్సహిస్తున్నారు.. సమాజంలో అసమానతలు సృష్టిస్తున్నారని ఆమె అన్నారు. 

శాన్ ఫ్రాన్సిస్కో నుంచి చికాగో.. అట్లాంటా వరకూ ఈ నిరసన కార్యక్రమం జరిగింది.