వైరల్ వీడియో : రోడ్డుపై చనిపోయి పడి ఉన్న వందలాది పక్షులు

  • Published By: veegamteam ,Published On : December 13, 2019 / 05:52 AM IST
వైరల్ వీడియో : రోడ్డుపై చనిపోయి పడి ఉన్న వందలాది పక్షులు

ఆకాశంలో రెక్కలు చాచి స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షులు టపటపా నేలపై రాలిపోయాయి. గాల్లో ఎగురుతూనే హఠాత్తుగా చచ్చిపోయి పడిపోయాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 300 పక్షులకు పైగానే రోడ్డుపై చచ్చిపోయి పడి ఉన్నాయి. అత్యంత విషాదాన్ని కలిగించిన ఈ ఘటన యూకేలోని నార్త్ వేల్స్‌లో చోటుచేసుకుంది. 

హన్నా స్టెవెన్స్ అనే మహిళ హాస్పిటల్‌కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డుపై వందలాది పక్షులు చనిపోయి కనిపించాయి. దీంతో ఆమె వాటికి ఫొటోలు తీసి భర్త డఫైడ్ ఎడ్వర్డ్స్‌కు పంపించిందిది. తాను హాస్పిటల్‌కు వెళ్లేప్పుడు పక్షులు గుంపుగా ఎగరడం చూశాను..కానీ తిరిగి వచ్చేసరికి వందలాది పక్షులు రోడ్డుపై చచ్చిపోయిపడి ఉన్నాయని, వాటిలో కొన్ని చనిపోయే పరిస్థితిలో ఉన్నాయని తెలిపింది. 

దీంతో వెంటనే హన్నా భర్త డఫైడ్ ఎడ్వర్డ్స్‌ ఘటనాస్థలానికి వచ్చాడు. భార్యా భర్తలు ఇద్దరూ కలిసి ఆ పక్షుల్ని లెక్కపెట్టారు. 300లకు పైగా పక్షులు చనిపోయినట్లు గుర్తించారు. ఈ పక్షులు ఎందుకు చనిపోయాయో తెలీదనీ..లేదా ఎవరైనా చంపేసి ఇక్కడ పడేశారా అనే అనుమానంతో పోలీసులకు కంప్లైంట్  చేశారు. హుటాహుటిని వచ్చిన పోలీసులు చనిపోయిన పక్షుల్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని వీటి  మరణం కారణంపై దర్యాప్తు చేపట్టారు. 

కాగా..2018లో కూడా ఇటువంటి ఘటనే జరిగిందనీ..కెనడ వైల్డ్ లైఫ్ సర్వీస్ తెలిపింది. కెనడాలోని వాంకోవర్‌లో 40 పైగా పక్షులు ఇలా నేలపై రాలి చనిపోయాయని తెలిపింది. కానీ వాతావరణ మార్పుల వల్ల కూడా పక్షుల మరణానికి కారణం అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు ఏదో కీడు జరుగబోతుందని ఇదోక ఘటన అంటుంటే..మరికొందరు  పక్షులపై ఎవరైనా విష ప్రయోగం చేసుంటారని ఇలా ఎవరికి వారు అనుమానులను కూడా వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యాక అసలు విషయం బైటపడాల్సి ఉంది.