20వేల టెడ్డీబేర్స్ సేకరించిన బామ్మ..గిన్నిస్ రికార్డ్..

20వేల టెడ్డీబేర్స్ సేకరించిన బామ్మ..గిన్నిస్ రికార్డ్..

Teddy Bear Mama : అది ఐరోపా ఖండంలో హంగేరి. అక్కడ ఉండే వలేరియా స్మిట్ అనే బామ్మకు టెడ్డీబేర్ బొమ్మలంటే ప్రాణం. ఆమెకే కాదు చాలామంది ఆడపిల్లలకు టెడ్డీబేర్ బొమ్మలంటే ఇష్టం అనే విషయం తెలిసిందే. కానీ ఈ బామ్మ ఇప్పటి వరకూ ఏకంగా 20వేల టెడ్డీబేర్లను సేకరించారామె.

అన్ని బొమ్మల్ని ఆమెఏం చేస్తుంది? అంటే.. వాటిని కలెక్ట్ చేసి చిన్నారులకు ఆడుకోవటానికి ఇస్తారు..ఆ టెడ్డీబేర్లతో చిన్నారులు ఆడుకుంటుంటే వారి మొహాల్లో పొంగిపోయే ఆనందాన్ని మనసారా ఆస్వాదిస్తారు. పిల్లల కళ్లలో గెంతులేసే సంతోషాన్ని తన సంతోషంగా భావిస్తారు. ‘బంగారు తల్లులూ ఇదిగో ఇవి మీకోసమే’ అంటూ ఇచ్చేస్తారు. ఆమె అలా చేయటానికి ఓ కారణం ఉంది. ఆ కారణం వెనుక విషాదం కూడా ఉంది..పిల్లల కోసం తాను సేకరించిన టెడ్డీబేర్ మొమ్మలతో ఎగ్జిబిషన్లు కూడా నిర్వహిస్తూ..అక్కడకు వచ్చే చిన్నారులకు ఆ బొమ్మల్ని ఇస్తుంది వలేరియా స్మిత్..

వలేరియా 20వేల టెడ్డీబేర్ బొమ్మల్ని సేకరించటంతో ఆమెను ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డువారు గుర్తించారు. ఆమెకు గిన్నీస్ వరల్డ్ రికార్డునిచ్చారు. వలేరియా స్మిట్ 40 సంవత్సరాలుగా టెడ్డీ బేర్లను కలెక్ట్ చేస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక టెడ్డీబేర్లు కలిగిన వ్యక్తిగా 2019లోనే ఆమె గిన్నిస్​బుక్​లో చోటు సంపాదించుకున్నారు. తాను ఓ ఉద్ధేశ్యంతో టెడ్డీబేర్ బొమ్మల్ని సేకరిస్తే అదికాస్తా రికార్డుగా మారటంతో వలేరియా ఆనందాశ్యర్చాలను వ్యక్తంచేసారు వలేరియా. దీంతో ఆమె టెడ్డీబేర్ మామ (Teddy Bear Mama)గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె టెడ్డీబేర్లతో కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ఈ సందర్భంగా వలేరియా మాట్లాడుతూ..40ఏళ్ల నుంచి టెడ్డీబేర్​లను కలెక్ట్ చేస్తున్నా. 13వేల టెడ్డీబేర్లను సేకరించినప్పుడే నేను హంగేరియన్ అవార్డును గెలుచుకున్నా. ఆ తర్వాత గిన్నిస్ రికార్డు కోసం మరిన్ని సేకరించటంతో అదికూడా దక్కిందంటోంది. నేను సేకరించిన నేను ఎన్నో టెడ్డీ బేర్లను నర్సరీలకు, ప్రి స్కూల్స్​కు, పేద కుటుంబాలకు ఇచ్చా. చిల్డ్రన్ ఇన్​స్టిట్యూట్స్​ కోసం ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేశా. 30 నుంచి 50 టెడ్డీబేర్లతో ఆడుకునేలా టెడ్డీ బేర్ కార్నర్లను రూపొందించామని వలేరియా చెప్పారు.

అయితే తనకు టెడ్డీబేర్​లంటే ఎందుకంత ఇష్టమో కూడా వలేరియా ఈ సందర్భంగా చెప్పారు. చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని..దీంతో తన తల్లి మద్యానికి బానిసైందనీ..తనకు ఎవ్వరూ లేక తనకున్న టెడ్డీబేర్ బొమ్మతోనే ఆడుకునేదాన్నని తెలిపారు. నేను ఎక్కడకు వెళ్లినా నాకూడా నా టెడ్డీబేర్ ఉండాల్సిందే. అదిలేకుండా ఎక్కడికి వెళ్లేదాన్ని కాదు..దీంతో టెడ్డీ బేర్ అంటే తనకు ఇష్టం అలా అలా పెరిగిపోయిందని తెలిపారు. నా టెడ్డీబేర్ నా దగ్గర ఉంటే నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకునేదాన్ని కాదు దానితోనే నా లోకం అంతా..అలా టెడ్డీబేర్ నా జీవితంలో భాగమైపోయిందని తన గతాన్ని గుర్తు చేసుకున్నారామె. ఆతరువాత కొంతకాలానికి నా టెడ్డీబేర్ పోయింది. దాంతో నేను ఎంతో లోన్లీగా ఫీలయ్యేదాన్ని..అలా టెడ్డీబేర్ అంటే నాకు ఇష్టం పెరిగి ఇలా కలెక్ట్ చేసే హాబీగా మారిందనితెలిపారు.

ఆడుకునేందుకు బొమ్మలు లేక..పలు కారణాలతో ఒంటిరిగా ఉండే చిన్నారులకు..ఆర్థిక స్థోమత లేని పిల్లల కోసం నేను ఈ టెడ్డీబేర్లను సేకరిస్తున్నా..వాటిని నా ఎగ్జిబిషన్​కు వచ్చిన సమయంలో పిల్లలకు ఇచ్చి ఆడుకోమని చెబుతాను. అప్పుడు చిన్నారుల కళ్లలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని చూస్తే చాలు నా మనస్సంతా ఆనందంతో నిండిపోతుంది..దానికి మించిన ఆనందం నాకు ఎక్కడా దొరకదని ‘టెడ్డీబేర్ మామ’ వలేరియా స్మిత్ తెలిపారు.

నా గురించి తెలిసిన చాలామంది నాకు టెడ్డీబేర్ బొమ్మల్ని పంపిస్తుంటారని తెలిపారు. నాకు ఎన్నేళ్లు వచ్చినా నేనింకా చిన్నారిలాగానే టెడ్డీబేర్లతో ఆడుకుంటాను. నా తోటి చిన్నారులు టెడ్డీతో ఆడుకుంటుంటే నాకు లేదని బాధపడేదాన్ని. అందుకే టెడ్డీ కలెక్షన్ ప్రారంభించాను. ఇప్పటికీ టెడ్డీని నేను హత్తుకుని పడుకుంటాను, దాన్నుంచి వచ్చే ప్రేమను ఆస్వాదిస్తాను’ అని స్మిత్ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ నేను టెడ్డీబేర్ ను హత్తుకుని పడుకుంటానని చిన్నపిల్లలా చెప్పారామె.