Viagra Murder : ద్యావుడా.. వయాగ్రా వేసుకున్నా శృంగారానికి ఒప్పుకోలేదని.. 61ఏళ్ల భార్యను హత్య చేసిన 80ఏళ్ల భర్త

తన భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఆ భర్త ఆశపడ్డాడు. అదే విషయాన్ని ఆమెతో చెప్పాడు. ఆమె సరే అంది. తన సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి వయాగ్రా మాత్రలు వేసుకుని బెడ్ రూమ్ లో భార్య కోసం..

Viagra Murder : ద్యావుడా.. వయాగ్రా వేసుకున్నా శృంగారానికి ఒప్పుకోలేదని.. 61ఏళ్ల భార్యను హత్య చేసిన 80ఏళ్ల భర్త

Viagra Murder

Viagra Murder : ఇటలీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వయాగ్రా వేసుకున్నా తనతో శృంగారానికి ఒప్పుకోలేదని భర్తే భార్యను హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. తన భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఆ భర్త ఆశపడ్డాడు. అదే విషయాన్ని ఆమెతో చెప్పాడు. ఆమె సరే అంది. తన సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి వయాగ్రా మాత్రలు వేసుకుని బెడ్ రూమ్ లో భార్య కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో భార్య వచ్చింది. అతడికి షాక్ ఇచ్చింది. తనకిప్పుడు శృంగారం వద్దని, మరోసారి ఎప్పుడైనా చూద్దామని చెప్పి పడుకొంది. అంతే, కోపంతో రగిలిపోయిన ఆ వృద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను మర్డర్ చేశాడు.

ఆయన పేరు విటో కంగిని. వయసు 80 ఏళ్లు. ఆయన భార్య పేరు నటాలియా కైరో చోక్. వయసు 61ఏళ్లు. ఇటీవల క్రిస్ మస్ వేడుకలను విటో దంపతులు ఘనంగా జరుపుకున్నారు. అదే సమయంలో భార్యతో శృంగారం చేయాలనుకున్నాడు భర్త. అదే విషయాన్ని భార్యకు చెప్పాడు. ఆమె కూడా సరే అనడంతో విటో ఆనందపడిపోయాడు. 80ఏళ్ల వయస్సులో తన కోరికను తీర్చుకోవడానికి సామర్ధ్యం సరిపోదేమో అని అనుకుని శృంగార సామర్ధ్యం పెంచే వయాగ్రా మాత్రలు వేసుకున్నాడు. మానసికంగా, శారీరకంగా సిద్ధమై భార్య కోసం ఎదురుచూశాడు.

Scientists Warning: అంతరిక్షంలోకి మనుషులు వెళితే చంపుకుతినడం ఖాయం: శాస్త్రవేత్తలు

భార్య బెడ్ రూమ్ లోకి రాగానే ఆమెను కౌగిలించుకున్నాడు. అయితే, ఆమె అతడిని పక్కకు నెట్టింది. ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పి పడుకుంది. అంతే, భార్య తీరుతో ఆ భర్తకు పట్టరాని కోపం వచ్చింది. ఆవేశంతో ఊగిపోయాడు. అదే కోపంలో పక్కనే ఉన్న కత్తి తీసుకుని భార్యను చంపేశాడు.
ఆపై ఏమీ ఎరగని వాడిలా రెండు రోజులు అలాగే బయట తిరిగాడు. ఆ తర్వాత తన భార్యను తానే హత్య చేసినట్లు చుట్టుపక్కల వారికి చెప్పాడు. పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరాడు. అయితే వారు భయపడ్డారు. లేని పోని తలనొప్పి మాకెందుకు అని ఊరుకున్నారు.

ఇలా లాభం లేదనుకున్న విటో.. తన భార్య చెప్ గా రెండేళ్ల పాటు పని చేసిన రెస్టారెంట్ ఓనర్ కి కాల్ చేశాడు. నా భార్య ఇక ఎప్పటికీ కనిపించదని అతడితో చెప్పాడు. అతడి మాటలతో రెస్టారెంట్ ఓనర్ కి అనుమానం వచ్చింది. వెంటనే అతడు పోలీసులుకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న మరుక్షణమే పోలీసులు రంగంలోకి దిగారు. విటో ఇంటికి వెళ్లి చూశారు. అక్కడ రక్తపుమడుగులో పడున్న మృతదేహాన్ని చూశారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆమె శరీరం పై నాలుగు చోట్ల పొడిచాడు. ఒకసారి గుండెపైనా పొడిచాడు. ఘటన స్థలంలో పడున్న కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Mark Zuckerberg: వ్యవసాయంలోకి మార్క్ జూకర్‌బర్గ్, రూ.127కోట్లతో స్థలం కొనుగోలు

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వాళ్లు విటోని విచారించగా.. అతడు షాకింగ్ సమాధానం చెప్పాడు. వయాగ్రా వేసుకున్నాను.. శృంగారానికి ఒప్పుకోలేదు.. అందుకే చంపేశాను అని సింపుల్ గా చెప్పాడు. అతడి మాటలకు స్థానికులే కాదు పోలీసులకు సైతం దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది.