లాక్‌డౌన్‌లో భార్యను గొంతు కోసి హత్యచేశాడు.. భర్త దోషి కాదని తేలింది!

లాక్‌డౌన్‌లో భార్యను గొంతు కోసి హత్యచేశాడు.. భర్త దోషి కాదని తేలింది!

Husband not guilty of murdering wife in lockdown : కరోనా మహమ్మారి లాక్ డౌన్ సమయంలో భార్యను గొంతు కోసి హత్యచేసిన భర్త దోషి కాదని తేలింది. టోర్ఫెన్‌లోని క్వాంబ్రాన్ దేశవ్యాప్తంగా కోవిడ్ లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ హత్యా ఘటన జరిగింది. భార్యతో గొడవ అనంతరం 70ఏళ్ల ఆంథోనీ విలియమ్స్ 46ఏళ్ల తన భార్యను మార్చి 28న గొంతు కోసి హత్య చేశాడు. ఈ హత్యకేసును స్వాన్సీ క్రౌన్ కోర్టులో ఐదు గంటల పాటు విచారించింది.

కరోనావైరస్, డబ్బు, తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన విలియమ్స్ లాక్ డౌన్ సమయంలో చాలా రాత్రులు సరిగా నిద్రపోలేదని డిఫెన్స్ తెలిపింది. విలియమ్స్ తన భార్యను హత్యచేయడానికి ముందు కొన్ని వారాలుగా నిరాశ, ఆందోళనతో బాధపడ్డాడు. బెడ్ రూంలో జరిగిన గొడవ సమయంలో విలియమ్స్ తన భార్య రూత్ విలియమ్స్ ను హత్యచేసినట్టు అంగీకరించాడు. భర్త తనపై దాడి చేసిన సమయంలో ఆమె భయంతో మెట్లవైపు పరిగెత్తినట్టు విచారణలో గుర్తించారు.

గొంతు కోయడంతో ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయిందని ప్రాసిక్యూషన్ అభిప్రాయపడింది. భార్యను హత్య చేసిన అనంతరం విలియమ్స్ పక్కంటి వారి దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పినట్టు తెలిపాడు. అలాగే పోలీసులను సమాచారం ఇవ్వాలని చెప్పినట్టు విచారణలో అంగీకరించాడు. రక్తపు మడగులో పడిన భార్యను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. తాను భార్యను హత్య చేయలేదని, పొరపాటున ఆవేశంలో అలా చేశానని, తాను ఎందుకు అలా క్రూరంగా ప్రవర్తించానో తనకే తెలియదని చెప్పుకొచ్చాడు.

కొన్నిరోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాని తెలిపాడు. దాడి సమయంలో అతడి మానసిక స్థితి గురించి మనస్తత్వవేత్తలు ఆధారాలు ఇచ్చారు. యూకేలో విధించిన కఠినమైన కరోనావైరస్ ఆంక్షలతో ఆందోళన నిస్పృహ అనారోగ్యంతో విలియమ్స్ బాధపడినట్టు డాక్టర్ అలిసన్ విట్స్ కోర్టుకు విన్నవించారు. స్వాన్సీ క్రౌన్ కోర్టులోని జ్యూరీ విలియమ్స్ హత్యకు పాల్పడినట్లు ఏకగ్రీవంగా గుర్తించింది. కానీ, అతడు దోషి కాదన్నప్పటికీ న్యాయమూర్తి పాల్ థామస్ విలియమ్స్‌కు శిక్ష విధిస్తానని పేర్కొన్నారు.