ఈ శాంతి నాకు వద్దు….అమెరికా-తాలిబన్ ఒప్పందంపై ఆఫ్గాన్ మహిళల్లో భయాందోళనలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 1, 2020 / 12:00 PM IST
ఈ శాంతి నాకు వద్దు….అమెరికా-తాలిబన్ ఒప్పందంపై ఆఫ్గాన్ మహిళల్లో భయాందోళనలు

అమెరికా, ఆప్ఘనిస్తాన్‌ తాలిబన్ల మధ్య శనివారం(ఫిబ్రవరి-29,2020) చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఏళ్ల తరబడి అఫ్గానిస్తాన్ లో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు రెండేళ్లుగా తాలిబన్లతో చర్చలు జరిపిన అమెరికా, ఈమేరకు శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఖతార్‌లోని దోహాలో సమావేశమైన ఇరుదేశాల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం 14 నెలల్లో ఆఫ్గనిస్తాన్ లో ఉన్న అమెరికా దళాలు ఆ దేశాన్ని విడిచిపెట్టనున్నాయి. అమెరికా తమ సైన్యాన్ని పూర్తిగా ఆఫ్గనిస్తాన్ నుంచి విరమించుకోనున్నట్లు ఒప్పందంలో ఉంది.

ఆఫ్గనిస్తాన్ వదలేసేందుకు యూఎస్ బలగాలు రెడీ అవడంతో ఇక తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు డోర్లు తెరుచుకున్నాయి. అయితే శాంతి అనే ముసుగులో చేసుకున్న ఈ ఒప్పందం కారణంగా తమ స్వేచ్ఛను కోల్పోతామంటూ ఆప్గనిస్తాన్ దేశంలోని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 2001లో న్యూయార్క్‌లో ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన అల్-ఖైదా గ్రూప్ దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా బలగాలు దాడి చేశాయి.  ఈ దాడుల్లో ఇప్పటివరకు అమెరికా దళాలకు చెందిన 2,400 మంది మరణించారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పటికీ 12వేల మంది అమెరికా దళానికి చెందిన వారున్నారు.

2001లో అమెరికా సైన్యం ఆఫ్గనిస్తాన్ లో అడుగుపెట్టే ముందు తాలిబన్లే అక్కడ అధికారంలో ఉన్నారు. 2001కు ముందు దాదాపు ఐదేళ్లు తాలిబన్లు అక్కడ అధికారంలో ఉన్నారు. ఉక్కుపాదంతో ఆఫ్గనిస్తాన్ లో ప్రజల హక్కులను కాలరాస్తూ, కఠినమైన షరియా చట్టాల కింద మహిళలను తమ సొంత ఇళ్లల్లోనే ఖైదీలుగా మార్చేశారు. తాలిబాన్ల పతనం మహిళల జీవితాలను మార్చివేసింది. సాంప్రదాయిక గ్రామీణ ఆఫ్ఘనిస్తాన్ కంటే కాబూల్ వంటి పట్టణ ప్రాంతాల్లో ఇది చాలా ఎక్కువ. కానీ దేశవ్యాప్తంగా, మహిళలు తిరుగుబాటుదారుల పట్ల జాగ్రత్తగా ఉన్నారు. హింసను అంతం చేయాలనే కోరికతో ఉన్నారు కాని దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న భయంతో ఆఫ్గనిస్తాన్ మహిళలు ఉన్నారు. 

ఆఫ్ఘన్ మహిళా ప్రొఫెషనల్స్ ఈ రోజు తీవ్రంగా రక్షించుకుంటున్న….విద్య, పని హక్కులు తాలిబాన్ లు అధికారంలో ఉన్న సమయంలో వాళ్లకి లేవు. తాలిబన్లు తమ వాళ్లను చంపడం ఆపేసి శాంతిని అనుసరిస్తే తాను చాలా సంతోషంగా ఫీల్ అవుతానని హీరాట్ సిటీకి చెందిన సతేస్ ఒమన్ సీతార అక్రిమి తెలిపారు. అయితే తాలిబన్లు మాత్రం మళ్లీ పాత మెంటాలిటీతో అధికారంలోకి వస్తే కనుక మళ్లీ మాకు నరకమే అని ముగ్గురు పిల్లలకు తల్లి అయిన ఓ వితంతువు తెలిపింది. వాళ్లు ఇంట్లో కూర్చోవాలి అని ఆదేశిస్తే నా కుటుంబాన్ని పోషించుకోలేను అని ఆమె తెలిపింది.

ఆప్గాన్ వ్యాప్తంగా వేలాది మంది మహిళలు తనలాగే ఆందోళన చెందుతున్నారని తెలిపింది. తాలిబన్ల ఆగమనం మహిళలు పనిచేసే హక్కు,స్వేచ్ఛ,స్వతంత్ర్యం పై తాలిబన్ల ఆగమనం ప్రభావం చూపుతుందని నమ్ముతున్నీనని,అక్రిమి ఆందోళనలను సమర్థిస్తున్నానని కాబుల్ కి చెందిన వెటర్నేరియన్ 30ఏళ్ల తహీరా రీజయ్ తెలిపారు. తాలిబన్ల మెంటాలిటీలో ఎలాంటి మార్పు లేదని ఆమె తెలిపింది. ప్రతి ఒక్కరికి శాంతి కావాలని కానీ తాలిబన్ల పునరాగమనంతో కాదని,ఇలాంటి శాంతి తమకు అవసరం లేదని ఆమె తెలిపింది.