Rishi Sunak: బ్రిటిష్ ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నట్లు జాన్సన్ చేసిన ప్రకటనపై రిషి సునక్ స్పందన

బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాన్ని రిషి సునక్ ప్రశంసించారు. కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ, బ్రెగ్జిట్, ఉక్రెయిన్ లో యుద్ధం వంటి సవాళ్లను మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సమర్థంగా ఎదుర్కొన్నారని రిషి చెప్పారు. యూకేకు ఎన్నడూ ఎదురుకాని సవాళ్లు ఆయన హయాంలో ఎదురయ్యాయని అన్నారు. వాటిని సమర్థంగా ఎదుర్కొన్న నేతగా ఆయనకు యూకే ప్రజలు కృతజ్ఞతాభావంతో ఉన్నారని రిషి సునక్ చెప్పారు.

Rishi Sunak: బ్రిటిష్ ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నట్లు జాన్సన్ చేసిన ప్రకటనపై రిషి సునక్ స్పందన

Rishi Sunak

UK PM race: బ్రిటిష్ ప్రధాని, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి రేసుల్లో నిలవబోనని బోరిస్ జాన్సన్ చేసిన ప్రకటనపై ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ స్పందించారు. బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ, బ్రెగ్జిట్, ఉక్రెయిన్ లో యుద్ధం వంటి సవాళ్లను మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సమర్థంగా ఎదుర్కొన్నారని చెప్పారు. యూకేకు ఎన్నడూ ఎదురుకాని సవాళ్లు ఆయన హయాంలో ఎదురయ్యాయని అన్నారు.

వాటిని సమర్థంగా ఎదుర్కొన్న నేతగా ఆయనకు యూకే ప్రజలు కృతజ్ఞతాభావంతో ఉన్నారని రిషి సునక్ చెప్పారు. అయినప్పటికీ బ్రిటిష్ ప్రధాని, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి రేసుల్లో మళ్ళీ నిలవబోనని బోరిస్ జాన్సన్ చెప్పారని, అయితే, ప్రజలకు, దేశానికి ఆయన సేవలు కొనసాగుతాయని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

కాగా, కొన్ని నెలల క్రితం బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి నుంచి బోరిస్‌ జాన్సన్‌ వైదొలగిన విషయం తెలిసిందే. అనంతరం లిజ్‌ ట్రస్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె కూడా ఇటీవల రాజీనామా చేయడంతో రిషి సునక్ తదుపరి బ్రిటిష్ ప్రధాని, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..