బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం 20ఏళ్ల వయస్సులో సత్యాగ్రహం చేసి జైలుకి వెళ్లా : మోడీ

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ..ఢాకాలోని నేషనల్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తోన్న బంగ్లాదేశ్ “నేషనల్ డే”కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో కలిసి మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం 20ఏళ్ల వయస్సులో సత్యాగ్రహం చేసి జైలుకి వెళ్లా : మోడీ

I Was 20 22 Years Old When I Did Satyagraha For Bangladeshs Freedom Pm Modi In Dhaka1

PM MODI IN DHAKA బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ..ఢాకాలోని నేషనల్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన “బంగ్లాదేశ్ నేషనల్ డే”కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో కలిసి మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ జాతిపిత “షేక్ ముజిబూర్ రెహ్మాన్”కి మోడీ నివాళులర్పించారు. 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్య యుద్ధం సమయంలో బంగబంధు షేక్ ముజిబూర్ రెహ్మాన్ నాయకత్వం,భారత ఆర్మీ సహకారాన్ని ప్రశంసించారు మోడీ. రెహ్మాన్ మరణానంతరం ప్రకటించబడిన గాంధీ శాంతి బహుమతి 2020 ని  ఆయన చిన్న కుమార్తె మరియు ప్రధాని షుక్ హసీనా చెల్లెలు షేక్ రెహానాకు మోడీ అందిచారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ…భారతీయులకు ఇదొక గర్వకారణమైన విషయం. షేక్ ముజిబూర్ రెహ్మాన్ ను గాంధీ శాంతి బహుమతితో గౌరవించే అవకాశం మాకు కలిగింది. “ముక్తిజుడ్డో”లో బంగ్లాదేశ్ సోదర మరియు సోదరీమణులకు అండగా నిలబడిన ధైర్యసాహసాలు కలిగిన భారతీయ జవాన్లకు కూడా నేను ఈ రోజు సెల్యూట్ చేస్తున్నాను. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం జరిగిన యుద్ధంలో పాల్గొన్న చాలామంది భారతీయ సైనికులు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ రోజు బంగ్లాదేశ్‌లో..తమ దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి రక్తం మరియు భారత సైనికుల రక్తం కలిసి ప్రవహిస్తున్నాయి. ఎలాంటి ఒత్తిడికి లోనవని మరియు ఎలాంటి దౌత్యానికి బలైపోనటువంటి సంబంధాన్ని ఈ రక్తం ఏర్పరుస్తుంది. భారత్-బంగ్లాదేశ్ బంధం 50ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా 50మంది బంగ్లాదేశ్ వ్యాపారవేత్తలు భారత్ ను సందర్శించి మా స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ లో చేరాలని మరియు భారత పెట్టుబడిదారులని కలవాలని నేను ఆహ్వానిస్తున్నాను. బంగ్లాదేశ్ యువత కోసం స్వర్ణ జయంతి స్కాలర్ షిప్ ని నేను ప్రకటిస్తున్నాను.

పాకిస్తాన్ సైన్యం ఇక్కడి ప్రజలపై చేసిన దారుణాల చిత్రాలు మన దృష్టిని మరల్చడానికి ఉపయోగించబడ్డాయి. చాలా రోజులు ఆ చిత్రాలు మనల్ని నిద్రపోనివ్వలేదు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం నా జీవితంలో మొదటి ఉద్యమాలలో ఒకటని బంగ్లాదేశ్‌లోని సోదరులు మరియు సోదరీమణులకు గర్వంగా గుర్తు చేయాలనుకుంటున్నాను. నేను మరియు నా సహచరులు బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం సత్యాగ్రహం చేసినప్పుడు నాకు 20-22 సంవత్సరాలు వయస్సు ఉండింది. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటం కోసం ఈ సత్యాగ్రహ సమయంలో జైలుకు వెళ్ళే అవకాశం కూడా నాకు లభించింది

వర్తక మరియు వాణిజ్య రంగాలలో మనకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. అయితే అదే సమయంలో, ఉగ్రవాదం వంటి బెదిరింపులు కూడా మనకు ఉన్నాయి. ఇటువంటి అమానవీయ చర్యల వెనుక ఉన్న ఆలోచనలు, శక్తులు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడానికి మనం అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాలి. రెండు దేశాలకు ప్రజాస్వామ్య బలం ఉంది మరియు భవిష్యత్ కోసం దూరదృష్టి ఉంది. కలిసి అభివృద్ధి చెందుతున్న భారతదేశం మరియు బంగ్లాదేశ్ ప్రాంతానికి ఇది అవసరం. అందుకే భారత, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు ఈ దిశలో అర్ధవంతమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా COVID-19 వ్యాక్సిన్‌లను బంగ్లాదేశ్‌కు చెందిన సోదర, సోదరీమణులు వాడుతున్నందుకు భారతదేశం చాలా సంతోషంగా ఉందని మోడీ అన్నారు.