A74 Iceberg : ప్రపంచాన్ని భ‌య‌పెడుతున్న భారీ మంచు కొండ‌

ఓ భారీ మంచు కొండ ప్రపంచాన్ని భ‌య‌పెడుతోంది. అంటార్కిటికాలోని వెడెల్ స‌ముద్రంలో తేలియాడుతున్న ఈ ఐస్‌బర్గ్.. ప‌క్క‌నే ఉన్న బ్రంట్ ఐస్ షెల్ఫ్‌ను ఢీకొట్టేలా క‌నిపిస్తోంది.

A74 Iceberg : ప్రపంచాన్ని భ‌య‌పెడుతున్న భారీ మంచు కొండ‌

A74 Iceberg

A74 Iceberg : అంటార్కిటికా ఖండం మొత్తం మంచుతోనే కప్పబడి ఉంటుంది. ప్రపంచంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతాయి. తూర్పు అంటార్కిటికా ప్రాంతంలో -94°C ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ మంచు ప్రదేశంలో అప్పుడప్పుడు భారీ మంచుకొండలు విరిగి సముద్రంలో పడుతుంటాయి. ఈ సమయంలో ఆ ప్రాంతంలో సముద్ర మట్టం పెరుగుతుంటుంది.

తాజాగా వెడెల్ స‌ముద్రాన్ని అనుకోని ఉన్న మంచు కొండచరియ కూలి సముద్రంలో పడిపోయింది. ఇది ఢిల్లీ నగరమంతా పెద్దదిగా ఉండటం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బ్రంట్ ఐస్ షెల్ఫ్ నుంచి 1270 చదరపు కిలోమీటర్ల పరిమాణంలో ఉన్న ఈ ఎ-74 విరిగిపడింది.

ఎ-74 ఉన్న ప్రాంతంలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో అది వేరుపడిన బ్రంట్ ఐస్ షెల్ఫ్ ను ఢీకొనే ప్రమాదం ఉందని హిమానీనద శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా జరిగితే 1700 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల సైజులో ఉండే మ‌రో మంచు కొండ విడిపోతుంద‌ని భావిస్తున్నారు.

ఇలా జరిగితే మంచుకొండలో మరిన్ని పగుళ్లు ఏర్పడి పర్యావరణానికి ముప్పుగా మారుతాయని చెబుతున్నారు. 150 మీటర్ల మందంతో ఉండే ఈ ఐస్ ముక్క సముద్రంలో పడితే సముద్ర మట్టం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు.