A68 Iceberg Melt : ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ A68 ఇకలేనట్టే..

ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ.. అదే A68.. కనుమరుగైపోతోంది. ప్రపంచానికి సుపరిచితమైన ఈ ఐస్ బర్గ్ రోజురోజుకీ కరిగిపోతోంది. అంటార్కాటికాలో కలిసిపోతోంది. దాదాపు 6వేల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం క్రమంగా అంతరించిపోతోంది.

A68 Iceberg Melt : ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ A68 ఇకలేనట్టే..

Iceberg That Became A Social Media Star Melts Away

ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ.. అదే A68.. కనుమరుగైపోతోంది. ప్రపంచానికి సుపరిచితమైన ఈ ఐస్ బర్గ్ రోజురోజుకీ కరిగిపోతోంది. అంటార్కాటికాలో కలిసిపోతోంది. దాదాపు 6వేల చదరపు కిలోమీటర్లు (2,300 చదరపు మైళ్లు) విస్తీర్ణం ఉన్న ఈ మంచుకొండ క్రమంగా అంతరించిపోతోంది. 2017లో ఐస్‌బర్గ్ అంటార్కాటికా నుంచి చీలిపోయింది. ఒక చిన్న దేశమంతా పరిమాణంలో ఉన్న ఈ మంచుఖండం వేల్స్ విస్తీర్ణంలో మూడోవంతు ఉంటుంది.

Ice

శాటిలైట్లు తీసిన ఫొటోలను పరిశీలిస్తే.. మెగా బర్గ్ వర్చువల్ గా అదృశ్యమైపోయింది. ఇప్పుడు లేదు. లెక్కలేననంతగా చిన్న ముక్కలుగా చీలిపోయిందని యూఎస్ నేషనల్ ఐస్ సెంటర్ వెల్లడించింది. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని, ఒకప్పటి ఐస్ బర్గ్ ఇప్పుడు అక్కడ లేదని అంటోంది. A68 అనే అతిపెద్ద మంచుభాగం అంటార్కిటికాలోని పెనిన్ సులా కొనలో భాగం.. ఏడాది క్రితం ఈ భాగం పక్కకు జరిగిపోయింది. ఉత్తరం నుంచి కరిగిపోతోంది.

Icess

బలమైన గాలుల పీడనానికి మంచు భాగమంతా చెల్లాచెదరుగా మారిపోయింది. బిలియన్ టన్నుల ఈ మంచు పలక.. దక్షిణ అట్లాంటిక్‌లోకి బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ ఆఫ్ సౌత్ జార్జియా వైపు తిరుగుతోంది. దీనికారణంగా చాలా పెద్ద మంచుకొండలు కరిగిపోనున్నాయి. అంట్లాటిక్ లో ఉష్ణోగ్రతల్లో గాలి అత్యధికంగా పెరగడంతో పాటు నీళ్లు వేడక్కడం ద్వారా మంచుకొండ కరిగిపోతోంది. చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి కరిగిపోతోంది.

Robo

A68 ఎందుకు ఇలా అర్థాంతరంగా కరిగిపోతోందో అధ్యయనం చేసేందుకు గత ఫిబ్రవరి నెలలో సముద్రంలోకి కొన్ని రోబోలను పంపింది. అందులో ఒకటి మంచు ముక్కల్లో రెండు వారాల పాటు చిక్కుకుపోయింది. అయినప్పటికీ అక్కడి పరిస్థితులను పర్యవేక్షించింది. రెండు వారాల తర్వాత మే నెలలో రోబో లభ్యమైంది. A68కు సంబంధించి సమాచారాన్ని సేకరించింది. ఆ డేటా ఆధారంగా అధ్యయనం చేయగా.. సముద్రంలోకి భారీగా కొత్త నీళ్లు రావడం ద్వారా మంచు కరిగిపోయి ఉండొచ్చునని తేల్చేశారు.

A68