Donald Trump: నేను అధికారంలోకొస్తే.. యుక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఒక్కరోజులో ముగిస్తా..

వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ మళ్లీ అభ్యర్థిత్వాన్ని సమర్పించాడు.

Donald Trump: నేను అధికారంలోకొస్తే.. యుక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఒక్కరోజులో ముగిస్తా..

Donald Trump

Donald Trump: యుక్రెయిన్, రష్యా మధ్య ఏడాదికాలంగా యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్ లోని అనేక నగరాలపై రష్యా దళాలు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. వేలాది మందిమరణించగా, ప్రధాన నగరాలు ధ్వంసం అవుతున్నాయి. యుద్ధాన్ని నిలువరించడం, రష్యాని కట్టడం చేయడం ఎవరివల్ల కావడం లేదు. ఈ క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుక్రెయిన్, రష్యా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేను అధికారంలో ఉన్నట్లయితే యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మొదలై ఉండేదే కాదని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే రష్యా, యుక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజే ఆపేస్తానంటూ ట్రంప్ పేర్కొన్నాడు. యుద్ధాన్ని ముగించడం ద్వారా మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా ఆపగలమని ట్రంప్ అన్నారు.

Ivana Trump will : డొనాల్డ్‌ ట్రంప్‌ మొదటి భార్య ఇవానా పెద్ద మనస్సు.. పెంపుడు కుక్కతో పాటు సహాయకురాలికి ఆస్తిలో వాటా

వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ మళ్లీ అభ్యర్థిత్వాన్ని సమర్పించాడు. ఈ క్రమంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ ఎజెండాను వివరిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ రష్యా, యుక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇరు దేశాల మధ్య యుద్ధానికి కారణం బిడెన్ పరిపాలన విధానం అనికూడా ట్రంప్ విమర్శించారు. నేను మళ్లీ అమెరికా ప్రెసిడెంట్ అయితే యుక్రెయిన్ అభివృద్ధి చెందుతోందని అన్నారు.

Donald Trump: ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా అకౌంట్ల రీస్టోర్… రెండేళ్ల తర్వాత నిషేధం ఎత్తివేత

తాను ఎదుర్కొంటున్న ఫెడరల్, స్టేట్ ఇన్వెస్టిగేషన్ లలో ఏదైనా నేరారోపణ చేసినప్పటికీ 2024 అధ్యక్ష రేసు నుంచి తప్పుకోనని ట్రంప్ అన్నారు. ట్రంప్ ప్రస్తుతం అనేక నేర విచారణలతో సహా అనేక విచారణలను ఎదుర్కొంటున్న విషయం విధితమే. యూఎస్ కాపిటల్ అల్లర్ల కేసులో అతనిచుట్టూ ఉచ్చుబిగుసుకునే అవకాశం ఉంది. పోలీసులు ట్రంప్ పై కేసు నమోదు చేయొచ్చు. అయితే, 2021 జనవరి 6న యూఎస్ కాపిటల్ పై జరిగిన హింసాకాండ కేసులో తాను విచారణ నుంచి విముక్తి పొందానన్న ట్రంప్ వాదనను తిరస్కరించాలని యూఎస్ న్యాయశాఖ మార్చి 2న కోర్టును కోరింది.