Emergency In New York : న్యూయార్క్‌లో వలసల సంక్షోభం.. ఎమర్జెన్సీ విధింపు

అమెరికాలోని న్యూయార్క్‌లో ‘వలసల సంక్షోభం’ నెలకొంది. దీంతో ఆ నగర మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి దక్షిణ సరిహద్దు గుండా నగరంలోకి 17 వేల మందికి పైగా వలస వచ్చారు. రిపబ్లికన్‌ పాలిత రాష్ట్రాలైన టెక్సాస్‌, అరిజోనా, ఫ్లారిడా నుంచి డెమోక్రటిక్‌ రాష్ట్రాలకు వలసలు పెరిగిపోయాయి.

Emergency In New York : న్యూయార్క్‌లో వలసల సంక్షోభం.. ఎమర్జెన్సీ విధింపు

emergency in new york

Emergency In New York : అమెరికాలోని న్యూయార్క్‌లో ‘వలసల సంక్షోభం’ నెలకొంది. దీంతో ఆ నగర మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి దక్షిణ సరిహద్దు గుండా నగరంలోకి 17 వేల మందికి పైగా వలస వచ్చారు. రిపబ్లికన్‌ పాలిత రాష్ట్రాలైన టెక్సాస్‌, అరిజోనా, ఫ్లారిడా నుంచి డెమోక్రటిక్‌ రాష్ట్రాలకు వలసలు పెరిగిపోయాయి. సెప్టెంబర్‌ నుంచి ప్రతిరోజూ శరణార్థులతో కూడిన 5-6 బస్సులు న్యూయార్క్‌లో ప్రవేశిస్తున్నాయని ఆడమ్స్‌ తెలిపారు. నగర షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నవారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు శరణార్థులేనని వెల్లడించారు.

వలస వచ్చేవారిలో చిన్నారులు, వైద్యసేవలు అవసరమున్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. వారందరినీ ఆదుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో తమకు రూ.100 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఈ వలసల వల్ల ఇతర పనులకు వెచ్చించేందుకు నిధులు లేకుండా పోయాయని చెప్పారు. కావాలనే రిపబ్లికన్‌ రాష్ట్రాల నుంచి జనాలను ఇక్కడికి పంపిస్తున్నారని ఆరోపించారు.

US Green Card : భారతీయులకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఏడేళ్లు ప‌ని చేస్తే గ్రీన్ కార్డ్‌

నగర సామాజిక సేవలను కొందరు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని రిపబ్లికన్‌ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా, వెనిజులాకు చెందిన కార్లోస్‌ అనే శరణార్థి మీడియాతో మాట్లాడుతూ.. తమ దేశంలో డ్రగ్స్‌ సమస్య విపరీతంగా ఉందని, నిరుద్యోగం, హత్యలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని వెల్లడించారు. న్యూయార్క్‌ నుంచి మద్దతు లభిస్తుందన్న ఆశతోనే తాము వలస వస్తున్నామని పేర్కొన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.