మరో పుల్వామా దాడి..కర్ఫ్యూ తొలగిస్తే కశ్మీర్ లో రక్తపాతం: పాక్ ప్రధాని

  • Published By: venkaiahnaidu ,Published On : September 27, 2019 / 04:14 PM IST
మరో పుల్వామా దాడి..కర్ఫ్యూ తొలగిస్తే కశ్మీర్ లో రక్తపాతం: పాక్ ప్రధాని

ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో భారత్ పై విషం కక్కాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్ ను రెచ్చగొట్టేలా తన ప్రసంగం కొనసాగించాడు. కశ్మీర్ లో కర్ఫ్యూ తొలగించగానే రక్తం పారుతుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మరో పుల్వామా ఘటన జరుగుతుందని,దానిని పాకిస్తాన్ చేసిందని ఆరోపిస్తాని అన్నారు. కశ్మీర్ లో చట్టవిరుద్ధంగా ఆర్టికల్ 370ని రద్దు చేశారన్నారు. మరో పుల్వామా ఘటన జరుగుతుందని,దానిని పాకిస్తాన్ చేసిందని ఆరోపిస్తాని అన్నారు.

అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇవాళ(సెప్టెంబర్-27,2019) న్యూయార్క్ లో… 74వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. చాలా కోపంతో ఊగిపోతూ మాట్లాడిన ఇమ్రాన్… కశ్మీర్ గురించి ప్రాస్తావించేందుకు తాను ఐక్యరాజ్యసమితికి వచ్చానని అన్నారు. తన ప్రసంగంలో హిందువులు,ఆర్ఎస్ఎస్,ప్రధాని మోడీపై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోడీ అమెరికాకు రాకూడదన్నారు.

500మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని భారత రక్షణశాఖ మంత్రి ప్రకటించారని, భద్రతా బలగాల ఆధీనంలో ఉన్న కశ్మీర్ లోకి 500మంది ఉగ్రవాదులు వెళ్లి ఏం చేయగలరని ఇమ్రాన్ అన్నారు. తమ దగ్గర అణ్వాయుధాలున్నాయంటూ పరోక్షంగా భారత్ ను బెదిరించే ప్రయత్నం చేశారు. కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి బాధ్యత తీసుకోవాలన్నారు. 

ఇస్లామిక్ ఫోబియాతో ప్రపంచం సతమతమవుతోందన్నారు. ముస్లింలను అణిచివేసే ధోరణి సరికాదన్నారు. ముస్లింలను ఆత్మాహుతి దళ సభ్యులుగా ముద్ర వేస్తున్నారన్నారు. కొందరు ఉగ్రవాదాన్ని ఇస్లాంకు ముడిపెడుతున్నారన్నారు. కొందరు నేతలు ఉగ్రవాదాన్ని ముస్లింలతో ముడిపెట్టారని తెలిపారు. మతంతో టెర్రరిజానికి సంబంధం లేదన్నారు. ఇస్లామిక్ ఫోబియాతో ప్రపంచం సతమతమవుతోందన్నారు.

యురోపియన్ దేశాలు ముస్లింలను అణిచివేస్తున్నాయని చెప్పారు. ముస్లింలపై అణిచివేతను ముస్లిం దేశాలు పట్టించుకోవడం లేదన్నారు. అమెరికాలో జరిగిన సెప్టెంబర్ 11 దాడులకు ముందు ఆత్మాహుతి దాడులు చేసింది తమిళ హిందువులేనన్నారు. సెప్టెంబర్ 11 దాడుల్లో ఆ దాడుల్లో తాము పాల్గొనలేదన్నారు. కానీ ఏ తప్పు చేయకుండా 70వేల మంది పాకిస్తానీయులు చనిపోయారన్నారు. కశ్మీర్ లో ఉగ్రవాదం గురించి మోడీ మాట్లాడారని,బలూచిస్తాన్ లో భారత గూఢచర్యం గురించి తాను చెప్పానని,తాను యుద్ధానికి వ్యతిరేకినన్నారు.

 శ్రీలంకలో ఆత్మాహుతి దాడులకు పాల్పడిన హిందువులను ప్రపంచం ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. భారత్ పెద్ద దేశం కాబట్టి ప్రపంచం మౌనంగా చూస్తోందన్నారు. భారత్ లోని ఆర్ఎస్ఎస్ క్యాంపులు ఉగ్ర క్యాంప్ లు అని కాంగ్రెస్ పాలనలో హోంమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పారన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్లే గాంధీజీని చంపారన్నారు. మోడీ కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తేనన్నారు. భారత్ లో ముస్లింలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందన్నారు. భారత్ నుంచి ముస్లింలను తరిమేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమన్నారు.

ఇమ్రాన్ ప్రసంగంపై రైట్ టురిప్లై ఆప్షన్ ను భారత్ ఉపయోగించుకోనుంది. రైట్ టు రిప్లై ద్వారా పాక్ ఆరోపణలను భారత్ తిప్పికొట్టనుంది. విదేశాంగశాఖ మంత్రి,భారత రాయబారి రైట్ టు రిప్లై ఇచ్చే అవకాశముంది.