Imran Khan: నాపై మళ్ళీ కాల్పులు జరపడానికి ఆ ముగ్గురు వేచిచూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

తనపై మళ్ళీ కాల్పులు జరపడానికి ముగ్గురు వేచిచూస్తున్నారని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాకిస్థాన్ లోని వరీదాబాద్ లో తనపై ఈ నెల 3న ఓ ర్యాలీలో కాల్పులు జరిగిన విషయంపై ఇమ్రాన్ పలు వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు జరిగిన కాల్పుల్లో ఇమ్రాన్ తో పాటు మరో నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే. పంజాబ్ ప్రావిన్స్ వజీరాబాద్‌లోని జఫారలీ ఖాన్ చౌక్ వద్ద ఆ ఘటన చోటుచేసుకుంది. తాజాగా దీనిపై ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ... ఆ సమయంలో ముగ్గురు కాల్పులకు పాల్పడ్డారని అన్నారు.

Imran Khan: నాపై మళ్ళీ కాల్పులు జరపడానికి ఆ ముగ్గురు వేచిచూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

God has given me another life, says former Pakistan PM Imran Khan day after being shot at

Imran Khan: తనపై మళ్ళీ కాల్పులు జరపడానికి ముగ్గురు వేచిచూస్తున్నారని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాకిస్థాన్ లోని వరీదాబాద్ లో తనపై ఈ నెల 3న ఓ ర్యాలీలో కాల్పులు జరిగిన విషయంపై ఇమ్రాన్ పలు వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు జరిగిన కాల్పుల్లో ఇమ్రాన్ తో పాటు మరో నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే. పంజాబ్ ప్రావిన్స్ వజీరాబాద్‌లోని జఫారలీ ఖాన్ చౌక్ వద్ద ఆ ఘటన చోటుచేసుకుంది. తాజాగా దీనిపై ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ… ఆ సమయంలో ముగ్గురు కాల్పులకు పాల్పడ్డారని అన్నారు.

ఆ ముగ్గురిలో మొదటి వ్యక్తి తనపై కాల్పులు జరిపాడని, రెండో వ్యక్తి కంటైనర్ ముందు భాగంపై కాల్పులు జరిపాడని చెప్పారు. అయితే, మూడో వ్యక్తి మాత్రం తనపై కాల్పులు జరిపిన మొదటి వ్యక్తిని చంపేయడానికి కాల్పులు జరిపాడని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆ క్రమంలో సాధారణ పౌరుడికి బుల్లెట్లు తగిలాయని చెప్పారు.

కంటైనర్ పై కాల్పులు జరిపిన రెండో వ్యక్తి నిజానికి తనను కాల్చాలనుకున్నాడని, అయితే, అది సాధ్యం కాలేదని అన్నారు. తనను హత్య చేయడానికి ప్రయత్నించిన ఆ ముగ్గురు ఇప్పటికీ తనను చంపాలని రెండోసారి కుట్రలు పన్ని ఎదురుచూస్తున్నారని చెప్పారు. తనపై దాడి జరగడం వెనుక ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్, మంత్రి షానౌల్లా, ఐఎస్ఐ కౌంట్ ఇంటలిజెన్స్ వింగ్ చీఫ్ మేజర్ జనరల్ ఫైజల్ నజీర్ ఉన్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..