Pak Elections : ఇమ్రాన్ ఖాన్‌కు షాకిచ్చిన ఓటర్లు

తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సొంతపార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు మున్సిపాలిటీల్లో మూడింట ఓటమిపాలైంది ఆ పార్టీ

Pak Elections : ఇమ్రాన్ ఖాన్‌కు షాకిచ్చిన ఓటర్లు

Pak Elections

Pak Elections : పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పట్టున్న ఖైబ‌ర్ ప‌క్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఘోర పరాజయం పాలైంది. ఈ ప్రాంతంలో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. దీనికి కారణం ధరల పెరుగుదల, నిరుద్యోగం, అభివృద్ధి కుంటుపడటమే అంటున్నారు అక్కడి ప్రజలు, మీడియా. పెషావర్‌ మేయ‌ర్ ప‌ద‌వి కోసం జ‌రిగిన ఎన్నిక‌ల్లో విప‌క్ష పార్టీ జ‌మియ‌త్ ఉలేమా ఏ ఇస్లామ్ విజయం సాధించి మేయ‌ర్ పీఠాన్ని కైవ‌సం చేసుకుందని పాక్ మీడియా పేర్కొంది.

చదవండి : Pakistan PM Imrankhan: కశ్మీర్‌పై పాక్ ప్రధాని ఇమ్రాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

పెషావర్‌ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ఘోర పరాజయం చవిచూసింది. ఇక్కడ 21 స్థానాల్లో ప్రతిపక్షాలు విజయం సాధించగా అధికార పార్టీ కేవలం 6 చోట్ల విజయం సాధించింది. మొత్తం నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా.. మూడు స్థానాలను ప్రతిపక్ష పార్టీలు కైవసం చేసుకోగా.. ఒక మున్సిపాలిటీలో ఖాన్ పార్టీ విజయం సాధించింది.

చదవండి : Pakistan Pm Imran selling gifts : దేశానికి వచ్చిన బహుమతుల్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమ్మేసుకుంటున్నారట..!