Imran Khan: అమెరికా కుట్ర ఆరోపణలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ క్షమాపణ

సెంట్రల్, దక్షిణ ఆసియాకు అమెరికా దౌత్యవేత్తగా ఉన్న డొనాల్డ్ లూ తనను దించేందుకు కుట్ర పన్నారని గతంలో ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అనేక మీడియా ఇంటర్వ్యూల్లో ఇమ్రాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై అప్పట్లోనే చాలా విమర్శలు వచ్చాయి.

Imran Khan: అమెరికా కుట్ర ఆరోపణలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ క్షమాపణ

Imran Khan

Imran Khan: తనను, తన పార్టీని అధికారంలోంచి కూల్చేందుకు అమెరికా కుట్ర పన్నిందని అప్పట్లో పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఇమ్రాన్ పార్టీ పీటీఐ (పాకిస్తాన్-తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్) క్షమాపణలు చెప్పింది. ఈ విషయాన్ని పాక్ సీనియర్ మంత్రి ఖ్వాజా అసిఫ్ వెల్లడించారు.

Woman Suicide: మెట్రో రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

సెంట్రల్, దక్షిణ ఆసియాకు అమెరికా దౌత్యవేత్తగా ఉన్న డొనాల్డ్ లూ తనను దించేందుకు కుట్ర పన్నారని గతంలో ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అనేక మీడియా ఇంటర్వ్యూల్లో ఇమ్రాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై అప్పట్లోనే చాలా విమర్శలు వచ్చాయి. తర్వాత ఇమ్రాన్ పదవి కోల్పోవడం, షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం వంటి పరిణామాలు జరిగాయి. దీనిపై తాజాగా ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన ప్రతినిధులు అమెరికా అధికారులను కలిసి క్షమాపణలు చెప్పినట్లు పాక్ మంత్రి ఖ్వాజా తెలిపారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కూడా దీనిపై అమెరికాకు లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. అమెరికాతో ఈ విషయంలో ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించాలి అనుకుంటున్నట్లు, అమెరికాతో సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు ఇమ్రాన్, అమెరికాకు తన సందేశం పంపించారని ఖ్వాజా అన్నారు.

Agnipath: ‘అగ్నిపథ్’కు పదివేల మంది మహిళల దరఖాస్తు

అయితే, ఖ్వాజా వ్యాఖ్యలను పీటీఐ పార్టీ ప్రతినిధులు ఖండిస్తున్నారు. ఇమ్రాన్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. పాక్ అన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటుందని, అలాగే పాక్‌ను ఎవరు పాలించాలో ఇతర దేశాలు నిర్ణయించలేవని మాత్రమే ఇమ్రాన్ అన్నారని పీటీఐ ప్రతినిధి ఫవాద్ చౌదురి అన్నారు.