Meteorite in women Bed room : ఆకాశం నుంచి బెడ్రూంలోకి దూసుకొచ్చిన ఉల్క..హడలిపోయిన మహిళ
ఆకాశంలోంచి దూసుకొచ్చిన ఓ ఉల్క ఇంట్లో నిద్రపోతున్న ఓ మహిళ మంచంపై పడింది. దీంతో ఆమె తృటిలో తప్పించుకోవటంతో ప్రాణాలతో బయటపడింది.

Sleeping Woman Avoids Death By Inches After Meteorite
Sleeping woman avoids death by inches after meteorite : బయటకు వెళితేనే కాదు..ఇంట్లో మంచంమీద పడుకున్నా ప్రమాదం వస్తుందనే ఘటన ఒకటి జరిగింది కెనడాలో.ఇంట్లో ప్రశాంతంగా మంచంమీద పడుకున్న ఓ మహిళపైకి ఆకాశం నుంచి ఓ మృత్యువు దూసుకొచ్చింది. కానీ ఆమెకు వీసమంత అదృష్టం ఉందేమో గానీ తృటిలో మృత్యువునుంచి తప్పించుకుంది. అందుకే అంటారు పెద్దలు అదృష్టవంతుడిని చెడగొట్టేవాళ్లు ఉండరని. అక్టోబర్ 4న కెనాడలోని బ్రిటీష్ కొలంబియాలో ఓ మహిళ బెడ్రూమ్ లో హాయిగా నిద్రపోతోంది.అలా నిద్రపోయే ఆమెపైకి ఆకాశం నుంచి ఏకంగా బెడ్రూమ్ లోకి దూసుకొచ్చింది ఓ ఉల్క. ఏదో ఢాం అని శబ్ధం రావటంతో ఆమె ఉలిక్కి పడి లేచి చూసింది.కాసేపు ఏం జరిగిందో అర్థం కాలేదు. అయోమయంలో పడిపోయింది. ఆమె బెడ్ మీద ఓ నల్లటిది కనిపించింది. దాన్ని చూసి భయపడిపోయింది. పరీక్షగా చూడగా అదేంటో తెలిసి షాక్ అయ్యింది. అదొక ఉల్క అని తెలిసి ఆశ్చర్యపోయింది.
Read more : ఉల్క కోటీశ్వరుడిని చేసింది
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని రూత్ హామిల్టన్ అనే మహిళ తన బెడ్రూంలో నిద్రపోతుంది. ఉన్నట్టుండి ఏదో శబ్దం వినిపించడంతో ఆమె దిగ్గున లేచింది. చూస్తే.. రూత్ దిండుపై ఓ నల్లని వింత పదార్థం కనిపించింది. పరీక్షగా చూడగా అదోక ఉల్క అని అర్థమైంది. రూత్ లేచిన వేళ బాగుందో ఏమోగానీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఎందుకంటే ఉల్క ఆమె మీద పడితే ఆమె ప్రాణాలకే ప్రమాదం జరిగేది. ఆ ఉల్కను చూసిన రూత్ వెంటనే ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేసింది.
ఈ ఘటన తరువాత రూత్ మాట్లాడుతూ.. ‘‘మన జీవితంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహించలేం అని అనటానికి ఈ ఘటనే ఉదాహరణ అని ఈ ప్రమాదంతో నాకు అర్థం అయ్యిందని తెలిపింది. హాయిగా మంచంపై నిద్రపోతున్న నారు ఒక్కసారిగా శబ్దం వినపడగానే భయం వేసింది. ఏజరిగిందో నాకేమీ అర్థం కాలేదు. బెడ్ మీద నుంచి లేవకపోతే ఏం జరిగి ఉండేదో ఆలోచించాలంటేనే భయంగా ఉంది. నేను చనిపోయి ఉండేదాన్నేమో అంటూ భయం భయంగా చెప్పింది.
Read more : రాబోయే 15 ఏళ్లలో మనుషులు అంతరిక్షంలోని ఉల్క బెల్ట్ కాలనీలో జీవించవచ్చు!
అదృష్టం బాగుంటడంతో బతికి బయటపడ్డానుగానీ అదినా మీద పడితే చచ్చిపోయేదాన్ని..నా ప్రాణాన్ని భయపెట్టిన ఈ నక్షత్రాన్ని నేను దాచుకుంటాను. నా మనుమలు నాకు జరిగిన ఈ ఘటన గురించి చెప్పుకుంటారు. దీన్ని వాళ్లకు చూపిస్తే వాళ్లు చాలా ఆశ్చర్యపోతారు’’ అంటూ తెలిపింది. ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ ఘటన వైరల్ గా మారింది.