Mumbai : BMW కార్ల గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 45 వాహనాలు పూర్తిగా దగ్థం

ముంబైలోని BMW కార్ల గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 45 వాహనాలు పూర్తిగా దగ్థమైపోయాయి.

10TV Telugu News

BMW warehouse burnt down 45 vehicles : ముంబైలోని బీఎండబ్ల్యూ కార్ల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 45 కార్లు దగ్ధమయ్యాయి. మంగళవారం (డిసెంబర్ 7,2021) అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో లగ్జరీ కార్లు దగ్థమైపోయాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎంఐడీసీ అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

నవీ ముంబైలోని తుర్భే ఎంఐడీసీలోని డీ-207 బీఎండబ్ల్యూ కార్ల గోదాంలో గోదాంలో ప్రమాదం చోటు చేసుకోవటంతో ఈ మంటల్లో 40 నుంచి 45 వాహనాలు దహనమయ్యాయని అధికారులు తెలిపారు. భారీగా మంటలు చెలరేగడంతో మంటలను ఆర్పేందుకు సిబ్బంది 10 అగ్నిమాపక యంత్రాలతో ఆరు గంటలపాటు శ్రమిస్తేనే గానీ మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లింది. నష్టం తీవ్రత గురించి..ప్రమాదానికి గల కారణాల గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

×