Lions for sale : సింహాలను అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం.. గేదె ధరకంటే కంటే చాలా తక్కువ

అమ్మకానికి సింహాలు సిద్ధంగా ఉన్నాయి. కొనుక్కోవాలనుకుంటున్నారా? సింహాలు కదా..కాస్ట్ ఎక్కువ ఉంటుందని అనుకోవద్దు..గేదెల కంటేచాలా చీప్ గా సింహాలు అమ్మానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంతకీ సింహాలను అమ్మేది ఎవరో వేటగాళ్లు కాదు..స్వయంగా దేశ ప్రభుత్వమే సింహాలను అమ్మకానికి పెట్టింది. అదికూడా గేదెల కంటే తక్కువ ధరకు..

Lions for sale : సింహాలను అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం.. గేదె ధరకంటే కంటే చాలా తక్కువ

Lions At Cheaper Rates Than Buffaloes

Lions at cheaper rates than buffaloes : అమ్మకానికి సింహాలు సిద్ధంగా ఉన్నాయి. కొనుక్కోవాలనుకుంటున్నారా? సింహాలు కదా..కాస్ట్ ఎక్కువ ఉంటుందని అనుకోవద్దు..గేదెల కంటేచాలా చీప్ గా సింహాలు అమ్మానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంతకీ సింహాలను అమ్మేది ఎవరో వేటగాళ్లు కాదు..స్వయంగా దేశ ప్రభుత్వమే సింహాలను అమ్మకానికి పెట్టింది. అదికూడా గేదెల కంటే తక్కువ ధరకు..పాకిస్థాన్ ప్రభుత్వం దుస్థితి ఇది..

పాకిస్థాన ప్రభుత్వం ఆ దేశపు జంతువులను కూడా అమ్ముకునేంత ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి దేశ సంపద అయిన జంతువుల్నికూడా అమ్మకానికి పెట్టింది. ఆ జంతువులు ఏదో ఆవో గేదో కాదు..అలాగని లేడి..జింకలు కూడా కాదు..ఏకంగా ఆర్థికంగా నిలుదొక్కుకునే భాంగానే జూలో ఉన్న సింహాలను కూడా అమ్మకానికి పెట్టింది. జూలో ఉన్న జంతువుల ఆలనా పాలనా చూసేందుకు కూడా డబ్బులులేని పరిస్థితి నెలకొన్న తీవ్ర దుర్భుక్ష పరిస్థితుల్లో పాకిస్థాన్ ప్రభుత్వం సింహాలను అమ్మకానికి పెట్టింది. ఈ విషయాన్ని సాక్షాత్తు పాక్ మీడియా సంస్థలు పలు కథనాల్లో తెలిపాయి. సింహాల ధర కూడా తక్కువే..ఎంత తక్కువ అంటే పాలిచ్చే ఓ గేదెను ధర కంటే తక్కువే.

లాహోర్ సఫారీ జూలోని అధికారులు కొన్ని ఆఫ్రికన్ సింహాలను (పాక్‌ కరెన్సీ) రూ.150,000 కంటే తక్కువ ధరకు విక్రయించడానికి సిద్ధంగా ఉందని స్థానిక మీడియా సంస్థ సామా టీవీ ప్రసారం చేసింది. పాకిస్తాన్‌లో ఒక గేదె ధర ఆన్‌లైన్ మార్కెట్‌లో రూ.350,000 వరకు లభిస్తుందని సదరు మీడియా పేర్కొంది. ఇక..లాహోర్ సఫారీ జూ యాజమాన్యం.. జూ లోని 12 సింహాలను ఆగస్టు మొదటి వారంలో విక్రయించి డబ్బు సంపాదించాలని భావిస్తోందని వెల్లడించింది. అమ్మకానికి ఉన్న సింహాలలో.. మూడు ఆడ సింహాలు ఉన్నాయి.

జూలో జంతువుల నిర్వహణకు అయ్యే ఖర్చులు…ఇతర ఖర్చులను తీర్చడానికి జూ అధికారులు సింహాలను విక్రయించాలని నిర్ణయించుకున్నారు. కాగా..సింహాల నిర్వహణ కాస్త ఖరీదైనది.ఒక సింహం రోజుకు 8 నుంచి 9 కిలోల మాంసాన్ని తింటుంది. దీంతో జూలో ఇతర జంతువుల నిర్వహణ కోసం సింహాలను అమ్మకానికి పెట్టింది పాక్ ప్రభుత్వం.