కరోనా వైరస్, సాధారణ జలుబుగా మారిపోతుంది

కరోనా వైరస్, సాధారణ జలుబుగా మారిపోతుంది

Covid will resemble the common cold : ప్రపంచాన్ని ఇంకా గడగడలాడిస్తున్న కరోనా వైరస్..భవిష్యత్ లో ఎలా ఉండబోతోంది. ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే దానిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఈ వైరప్ మహమ్మారి భవిష్యత్ లో సాధారణ జలుబుగా మారిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. SARS-CoV-1 తో పాటు మరో నాలుగు రకాల వైరస్ రకాలపై పరిశోధనలు జరిపినట్లు journal Science వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలు అందులో ప్రచురితమయ్యాయి. వైరస్ లకు సంబంధించిన వ్యాధి నిరోధక చికిత్సా విధానం, సాంక్రమిక వ్యాధుల అధ్యయనాలను విశ్లేషించడం ద్వారా ప్రస్తుతం విజృంభిస్తోన్న కరోనా వైరస్ తీవ్రత తీరును శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

ప్రస్తుతం పాండామిక్ గా ఉన్న ఈ కరోనా వైరస్ ఎండమిక్ ఘా మారిన తర్వాత..దాని తీవ్రత తగ్గిపోతుందని అంచనా వేశారు. సాధారణ జలుబుకు కారణమయ్యే కరోనా వైరస్ ఎంతోకాలంగా వ్యాప్తిలో ఉన్నాయని, చిన్నతనంలోనే వాటి బారిన పడి ఉంటారని అంచనా వేశారు. సాధారణంగా చిన్న వయస్సులో సోకే ఇన్ఫెక్షన్ల వల్ల రోగ నిరోధక భక్తి లభిస్తుందని అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ శాస్త్రవేత్త జెన్నీ లావైన్ వెల్లడించారు.

3 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారుల్లో సార్స్ కోవ్ – 2 తొలుత సంక్రమించినప్పుడు ఓ వ్యాధిలో కనిపించినా..తర్వాత..దాని తీవ్రత తగ్గి..స్వల్ప వ్యాధిలోగే మారతుందని విశ్లేషిస్తున్నారు. భవిష్యత్ లో వచ్చే రోగాలకు సమర్థంగా ఎదుర్కోవడంలో పని చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వృద్ధులు ఇంకా వ్యాధి బారిన పడొచ్చని, అయితే..వారి చిన్న వయస్సులో ఉండగా..సోకిన ఇన్ఫెక్షన్ల కారణంగా..రోగ నిరోధక రక్షణను అందిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. టీకాలు వైరస్ తిరిగి రాకుండా..స్వల్పంగా రక్షణను కల్పిస్తుందని తెలిపారు. గతంలో కూడా ఇజ్రాయిల్ దీనిపై ఓ అంశాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. కొవిడ్ – 19 మహమ్మారిని ఒక సాధారణ జలుబు స్థాయికి తగ్గించే వీలుందని ఆ దేశ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం చేపడుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా లక్షల మంది ప్రాణాలు కాపాడగలగమని అమెరికా శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.