Jeff Bezos and Crew: స్పేస్ ఫ్లైట్‌లో ప్రయాణానికి జెఫ్ బెజోస్, సిబ్బంది ఎదురుచూపులు

Jeff Bezos and Crew: స్పేస్ ఫ్లైట్‌లో ప్రయాణానికి జెఫ్ బెజోస్, సిబ్బంది ఎదురుచూపులు

Jeff Bezos

Jeff Bezos and Crew: బిలియనీర్ అమెరికన్ బిజినెస్‌మాన్ జెఫ్ బెజోస్, ముగ్గురు టీమ్‌మేట్స్ కలిసి ఆదివారం కూడా క్రాష్ కోర్స్ ట్రైనింగ్ పూర్తి చేశారు. బ్లూ ఆరిజన్స్ కంపెనీకి చెందిన ప్రారంభోత్సవ విమానాన్ని అంతరిక్షం అంచుల వరకూ తీసుకెళ్లే ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నారు. మంగళవారం జరగాల్సిన ఈ ప్రయాణానికి వాతావరణం అనుకూలిస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు.

వెస్ట్ టెక్సాస్‌ మార్క్‌లోని సబ్ ఆర్బిటల్ లాంచ్ సైట్ లో బ్లూ ఆరిజన్స్ న్యూ షెపార్డ్ స్పేస్‌క్రాఫ్ట్ అసలైన పరీక్ష జరుగుతుంది. 60అడుగుల ఎత్తు, పూర్తి అటానమస్ రాకెట్ + క్యాప్సుల్ కాంబోతో రెడీ అయిన బెజోస్ స్పేస్ ఫ్లైట్ టూరిజం మార్కెట్ కోసమే ప్రత్యేకంగా సిద్ధమైంది.

లాంచ్ సైట్ నుంచి 11నిమిషాల ట్రిప్ ను ప్లాన్ చేసిన కంపెనీ.. అంతరిక్షానికి తొలి వృద్ధురాలిని తీసుకెళ్లిన ఘనత నమోదు చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఫిమేల్ ఏవియేటర్ 82ఏళ్ల వాలీ ఫంక్, 18ఏళ్ల ఫిజిక్స్ స్టూడెంట్ ఒలీవర్ డామెన్ ఈ టీంలో ఉన్నారు. ఇందులో జెఫ్ బెజోస్ తో పాటు, అతని సోదరుడు మార్క్ బెజోస్ పయనం కానున్నారు.

ప్రస్తుతం ఎటువంటి సమస్యలు లేవు. ఎగరడానికి సిద్ధంగా ఉన్నాం. వాతావరణం కూడా ఉదయం ఎనిమిది గంటల సమయంలో అనుకూలంగానే ఉంటుందనుకుంటున్నాం. ఇండియా టైం ప్రకారం.. మంగళవారం సాయంత్రం 6గంటల 30నిమిషాలకు ముహూర్తం ఖరారు చేశారు.

రిచర్డ్ బ్రాన్సన్ స్పేస్ టూరిజం కంపెనీకి చెందిన వర్జిన్ గెలాక్టిక్ లాంచ్ చేసిన తొమ్మిది రోజుల తర్వాత న్యూ షెపార్డ్ లాంచ్ అవనుంది. న్యూ మెక్సికో నుంచి మొదలుపెట్టిన ఈ ప్రయాణం సక్సెస్ కావడంతో బెజోస్ కు మరింత ప్రేరణ పెరిగింది.