లాక్‌డౌన్‌లో పెగ్గేయడం అలవాటైందా.. అంత సులువుకాదంట..

లాక్‌డౌన్‌లో పెగ్గేయడం అలవాటైందా.. అంత సులువుకాదంట..

లాక్‌డౌన్‌ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం అలవాటైందా.. అది అంత త్వరగా పోదట. లాక్‌డౌన్‌కు ముందున్న పొజిషన్ కు మళ్లీ రావడం చాలా టఫ్ అంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో 22శాతం మంది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నారని డ్రింక్అవేర్ ఓ రీసెర్చ్ వెల్లడించింది. యాంగ్జైటీ ఫీల్ అవుతున్న వారు, బోర్‌డమ్ ఫీల్ అవుతున్న వారి గురించి సర్వేలు నిర్వహించారు. ఈ అలవాటు బ్రేక్ చేసుకోవడం అంత ఈజీ పని కాదని అంటున్నారు.



డ్రింక్అవేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలైన్ హిందాల్ మాట్లాడుతూ.. ‘ఆరోగ్యవంతమైన లైఫ్‌స్టైల్ అలవాటు చేసుకోవడం అంత ముఖ్యం కాదు. కొన్ని ఏజ్ గ్రూపుల వారికి లాక్‌డౌన్‌లో అలవాటైన కొత్త అలవాటు మానుకోవడం చాలా కష్టంగా మారింది. ప్రత్యేకించి కొందరు అలావాటుకు దూరం కాలేకపోవడం బాధగా అనిపిస్తుంది.



బోర్‌డమ్ గా ఫీల్ అయినా.. యాంగ్జైటీగా ఫీల్ అయినా ఎక్కువగా తాగడం మొదలుపెట్టేస్తున్నారు. దాని కారణంగా ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు మానసికంగానూ, శారీరకంగానూ కనిపించొచ్చు. ఆల్కహాల్ మీద డిపెండ్ అయి అదే పనిగా పెట్టుకున్న వాళ్లు ఉన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి అలవాటు మానుకునే వాళ్లే లేరు.



ఇది డైలీ పనిలో ఓ భాగమైతే మానడం కష్టమే. చాలా మంది ఈ అలవాటు ఉపశమనం కోసం, ఒత్తిడి నుంచి దూరం కావడం కోసం లేదా ఏదైనా సెలబ్రేషన్ కోసం మహమ్మారి లాక్‌డౌన్‌లో ఎక్కువగా తీసేసుకున్నారు. సాధారణంగా ఇళ్లలో గడిపే సమయం కంటే ఇది చాలా ఎక్కువ. ఇది మెంటల్ హెల్త్ స్ట్రాటజీల మీద ఎఫెక్ట్ చూపిస్తుందట.



ఎవరైనా ఆల్కహాల్ తీసుకోవడాన్ని మానేయాలనుకుంటే కచ్చితంగా సపోర్ట్ తీసుకోవాల్సిందే. ‘ఏ పరిస్థితులు అయితే డ్రింక్ చేయడానికి దగ్గర చేస్తున్నాయో వాటిని గుర్తించాలి. వారానికి 14 యూనిట్లు మించి తాగకపోతే సమస్యలు రావని తెలియజేయాలి’ అని ఎలైన్ అంటున్నారు.